నెక్ట్స్ సినిమా అల్లుడు శీనుతో..? | boyapati next movie with bellamkonda sai srinivas | Sakshi
Sakshi News home page

నెక్ట్స్ సినిమా అల్లుడు శీనుతో..?

May 12 2016 8:16 AM | Updated on Aug 3 2019 12:45 PM

నెక్ట్స్ సినిమా అల్లుడు శీనుతో..? - Sakshi

నెక్ట్స్ సినిమా అల్లుడు శీనుతో..?

సరైనోడు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన బోయపాటి శ్రీను, తన నెక్ట్స్ సినిమాను కన్ఫామ్ చేశాడు. అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ...

సరైనోడు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన బోయపాటి శ్రీను, తన నెక్ట్స్ సినిమాను కన్ఫామ్ చేశాడు. అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. స్పీడున్నోడు సినిమా రిలీజ్కు ముందే బోయపాటి సినిమా పట్టాలెక్కాల్సి ఉన్నా, అది వర్క్ అవుట్ కాలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమా బోయపాటి రెగ్యులర్ స్టైల్కు భిన్నంగా ఉంటుదన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు మాస్ యాక్షన్ సినిమాలను మాత్రమే తెరకెక్కించిన బోయపాటి ఈ సినిమాను సాఫ్ట్ లవ్ స్టోరిగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడట. బోయపాటి సినిమా అంటే భయానకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయన్న ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ నుంచి బయట పడటానికి సాయితో తెరకెక్కించే సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement