ఈ బుడ్డోడి డ్యాన్స్‌కు రచయిత ఫిదా | This Boy Dance Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

‘ఇలాంటి ప్రతిభ మట్టి గృహల్లోనే కనిపిస్తుంది’

Jun 29 2020 12:23 PM | Updated on Jun 29 2020 1:18 PM

This Boy Dance Video Goes Viral On Social Media - Sakshi

ముంబై: బాలీవుడ్‌ హీరో గోవిందా పాటకు ఓ బుడ్డోడు చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గోవిందా, కరిష్మా కపూర్‌లు నటించిన కూలి నెం.1 చిత్రంలోని ‘కిసి డిస్కో మెయిన్ జాయే తో మెయిన్ తో రాస్టే సే జా రాహా థా’ పాటకు ఫుల్‌ ఎనర్జీతో వేసిన ఈ బడ్డోడి స్టేప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సినీ రచయిత మనోజ్‌ ముంతాషీర్ శనివారం ట్విటర్‌లో షేర్‌ చేశారు.  (బస్సు పైకి బైక్‌.. నెటిజన్లు ఫిదా)

‘ఇలాంటి అసాధారణమైన ప్రతిభ మట్టి గృహల్లోనే కనిపిస్తుంది. కానీ బంధుప్రీతితో పేరుకుపోయిన ఖరీదైన షో రూముల్లో కాదు’ అంటూ రాసుకొచ్చారు. అంతేగాక ఈ వీడియోను వైరల్‌ చేస్తూ బాలుడి ప్రతిభను ప్రోత్సహించాలని ఆయన తన అభిమానులను కోరారు. మూడు రోజుల క్రితం షేర్‌ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 1.4 మిలియన్‌ల వ్యూస్‌, వేలల్లో కామెంట్స్‌ వచ్చాయి. ‘ఈ బాలుడు అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తున్నాడు’, ‘అద్భుతం.. భారత్‌లో చాలామంది ప్రతిభవంతులు ఉన్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement