సీనియర్‌ నటుడు మృతి.. | Bollywood actor Sitaram Panchal dies after long battle with lung cancer | Sakshi
Sakshi News home page

సీనియర్‌ నటుడు మృతి..

Aug 10 2017 12:51 PM | Updated on Apr 3 2019 6:34 PM

సీనియర్‌ నటుడు మృతి.. - Sakshi

సీనియర్‌ నటుడు మృతి..

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సీతారాం పంచల్‌ మృతి చెందారు.

ముంబై: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సీతారాం పంచల్‌   మృతి చెందారు. గత మూడు ఏళ్లుగా కెన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. 1994లో వచ్చిన బాండిట్‌ క్వీన్‌ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైన సీతారాం ‘పీప్లి లైవ్‌’, ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’, ‘పాన్‌సింగ్‌తోమర్‌’, ‘జాలీ ఎల్‌ఎల్‌బీ-2’ తదితర చిత్రాల్లో నటించారు. అనారోగ్యం కారణంగా సినిమా అవకాశాలు లేక కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గాలేక ఆయన గత నెలలో సోషల్‌ మీడియా వేదికగా తన చికిత్స కోసం అవసరమైన డబ్బు సాయం చేయాల్సిందిగా కోరారు.


ఆయన ధీన స్థితిని గుర్తించిన హరియాణ ప్రభుత్వం చికిత్సకు రూ.5లక్షలు సాయం అందించింది. సినీ ఆర్టీస్ట్‌ అసోసియేషన్‌ కూడా సీతారాం వైద్యం కోసం విరాళలు సేకరించింది. సీతారామ్‌కు 2014లో కెన్సర్‌ వచ్చిందని, అప్పటి నుంచి ఆయుర్వేదిక్‌ చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన భార్య ఉమ మీడియాకు తెలిపారు. బుధవారం 26వ పెళ్లి రోజు జరుపుకున్న సీతారాం మరుసటి రోజే మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement