బి.నాగిరెడ్డి పోస్టల్‌ స్టాంప్‌ విడుదల

B.Nagi Reddy postal stamp released - Sakshi

సాక్షి, చెన్నై : ప్రేక్షకులకు పలు చిరస్మరణీయ చిత్రాలను అందించిన అలనాటి ప్రముఖ నిర్మాత బి.నాగిరెడ్డి స్మారక పోస్టల్ స్టాంపును ముఖ్య అతిధిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం విడుదల చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో దగవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, రాష్ట్ర మంత్రి అన్భళగన్ ఆస్పత్రి నిర్వాహకులు, నాగిరెడ్డి వారసులు పాల్గొన్నారు. ఎన్నో చిత్రాల నిర్మాతగా, విజయా స్టుడియోస్ అధినేతగా, ఆస్పత్రుల వ్యవస్థపకులుగా, చందమామ పత్రిక పబ్లిషర్గా నాగిరెడ్డి సేవలు అమోఘమని ముఖ్య అతిధులు శ్లాఘించారు.

సినీ రంగాని, వైద్య రంగానికి నాగిరెడ్డి చేసిన సేవలని గుర్తుతెచ్చుకునే విధంగా పోస్టల్‌ స్టాంప్తో , పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషం కలిగించిందని వెంకయ్య నాయుడు అన్నారు. సమాజానికి సేవలు చేసిన నాగిరెడ్డి పేరిట స్టాంప్ విడుదల చేసేందుకుకు ముందుకు వచ్చిన తపాలా శాఖకు అభినందనలు తెలిపారు. నాగిరెడ్డి గొప్ప మానవతావాది అని, గొప్పవారి జ్ఞాపకాలను రేపటి తరాలకు అందించటం హర్షించదగ్గ పరిణామం అన్నారు. విజయా సంస్థ చిత్రాలతో పాటు చందమామ, బాలమిత్ర వంటి కథలు నాగిరెడ్డిని ఇప్పటికీ గుర్తుకు తెస్తాయని వెంకయ్య అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top