వడ్డీ సహా ఇచ్చేసా!

Bigg Boss sensation bids goodbye to Lawrence's film - Sakshi

తమిళసినిమా: చిత్రాలను అంగీకరించడం, ఆ తరువాత ఏదో ఒక కారణంతో వైదొలగడం హీరోయిన్లకిప్పుడు ఫ్యాషన్‌ అయిపోయింది. వీరంతా చెప్పేదొక్కటే తామా చిత్రాల్లో నటించలేదు. తీసుకున్న అడ్వాన్స్‌ తిరిగి ఇచ్చేస్తామని. తాజాగా ఈ కోవలోకి నటి ఓవియ చేరింది. ఈ అమ్మడికి హీరోయిన్‌గా ఇంతకు ముందు పెద్ద పేరేమీ లేదు.అయితే ఎప్పుడైతే బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొందో అప్పటి నుంచి యమ క్రేజ్‌ వచ్చింది.ఈ గేమ్‌ షోలో సహ నటుడు ఆరవ్‌తో ప్రేమంటూ కలకలం, పోలీసుల వరకూ పరిస్థితి వెళ్లడంతో ఓవియా ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. దీంతో కొత్తగా అవకాశాలు తలుపు తడుతుండడం విశేషం. రాఘవ లారెన్స్‌తో నటించే అవకాశం ఓవియాను వరించింది. అయితే అదే సమస్యగా మారింది. 

కాంచన 3 షూటింగ్‌ ప్రారంభానికి ఆలస్యం కావడంతో అమ్మడు ఓవియ ఆ చిత్రం నుంచి వైదొలిగిందట. ఆ చిత్ర వర్గాలు ఓవియ గురించి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో కాంచన–3 చిత్రం షూటింగ్‌ ఆలస్యం కావడం కారణంగానే తానా చిత్రం నుంచి వైదొలిగినట్లు తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా వడ్డీ సహా తిరిగి చెల్లించినట్లు నిర్మాతల మండలికి వివరణ ఇచ్చి చేతులు దులుపుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ వదంతులేనని లారెన్స్‌ చెప్పారు. కాంచన–3 షూటింగ్‌ జరుగుతోందని అందులో ఓవియ నటిస్తోందని లారెన్స్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top