‘సరిహద్దు’ సైనికుడుగా తనీష్ | Bigg Boss Fame Tanish Next Movie Sarihaddhu | Sakshi
Sakshi News home page

Jan 17 2019 4:49 PM | Updated on Jan 17 2019 4:49 PM

Bigg Boss Fame Tanish Next Movie Sarihaddhu - Sakshi

బిగ్ బాస్‌ షోతో ఆకట్టుకున్న యువ నటుడు తనీష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిహద్దు. ఇటీవల రంగు సినిమాతో తనీస్‌ను డైరెక్ట్ చేసిన కార్తికేయ సరిహద్దు సినిమా కూడా దర్శకత్వం వహించనున్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ ‘భాషను నేర్చుకొని జ్ఞానాన్ని సంపాదించాలనుకొని...ప్రతి భాషకు ఒక తెగ అనీ...కొన్ని తెగలకు ఒక కులం అనీ.. కొన్ని కులాలు కలసి ఒక మతం అనీ విడిపోతూ  మృగలనుండి మనుషులుగా.. మనుషులనుండి తెగలుగా... తెగలనునుండి.. కులాలుగా.. కులాలనుండి మతాలుగా... మతాలనుండి రాష్ట్రాలుగా... రాష్ట్రాలనుంచి దేశాలుగా.. సరిహద్దుల్ని గీసుకొంటూ... బతుకుతున్నాం. ఈ కాన్సెప్ట్ తో సరిహద్దు రూపొందబోతుంది ’ అన్నారు. 

తెలుగుతో పాటు హిందీ భాషలోనూ విడుదల చేయబోతోన్న ‘సరిహద్దు’ మూవీ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభం కానుంది. హైటెక్నికల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో పలువురు బాలీవుడ్‌ నటులు కూడా నటించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement