బిగ్‌బాస్‌: బాబాను ఎదిరించి కెప్టెన్‌ అయిన మహేశ్‌

Bigg Boss 3 Telugu Who Get Lucky Chance To Meet Their Families - Sakshi

బిగ్‌బాస్‌ ఇచ్చిన క్రేజీ కాలేజీ టాస్క్‌లో బెస్ట్‌ టీచర్‌గా బాబా భాస్కర్‌, బెస్ట్‌ స్టూడెంట్‌గా మహేశ్‌ ఎంపికయ్యారు. ‘ప్రచారమే ఆయుధం’ అనే కెప్టెన్సీ టాస్క్‌లో బాబా భాస్కర్‌ అతని బంటుగా పేరొందిన మహేశ్‌ తలపడ్డారు. వీరిద్దరూ ఇంటి సభ్యుల దగ్గరికి వెళ్లి గెలిపించమని మద్దతు కోరగా.. ఎవరి ప్రచారమైతే నచ్చుతుందో వారి మెడలో ఇంటి సభ్యులు పూలదండను వేస్తారు. ‘అధికారంలో ఉన్నప్పుడే మనిషి గుణం తెలుస్తుంది ఇది నేను చెప్పింది కాదు.. మహాత్మాగాంధీ చెప్పిన మాట. నాలో మార్పు కోసం నేను కెప్టెన్సీ కోరుకుంటున్నా’నంటూ మహేశ్‌ తన మాటలతో మ్యాజిక్‌ చేశాడు. అదేవిధంగా మహేశ్‌కు ఒక చాన్సిచ్చి చూద్దాం అని భావించిన ఇంటి సభ్యులందరూ (వితిక, పునర్నవి తప్ప) మహేశ్‌కు పూలమాలలు వేసి కెప్టెన్‌గా గెలిపించారు. ఇక కెప్టెన్‌ మహేశ్‌.. సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కెప్టెన్‌ మీటింగ్‌ పెట్టే ఆలోచనలో ఉన్నాడు.

చెప్పుకోండి చూద్దాం అనే లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో హిమజ సంచాలకులుగా వ్యవహరించింది. ఈ టాస్క్‌లో కెప్టెన్‌ మహేశ్‌ ప్లకార్డును పట్టుకుంటాడు కానీ దాన్ని చూడడు. ఇంటిసభ్యులు నేరుగా అక్కడ రాసి ఉన్న పేరును కెప్టెన్‌తో చెప్పించాలి. అందరూ సరిగ్గా చెప్పడంతో లగ్జరీబడ్జెట్‌ టాస్క్‌ విజయవంతంగా పూర్తయింది. ఇక ఎప్పుడూ డాన్స్‌తో హుషారుగా ప్రారంభమయ్యే రోజు కాస్త నేటి ఎపిసోడ్‌లో డల్‌గా స్టార్ట్‌ అయింది. లేస్తూనే ఏడుపు లంకించుకున్న శివజ్యోతిని శ్రీముఖి ఎత్తుకుని బుజ్జగించింది. అటు వితిక కూడా వరుణ్‌ ఒడిలో తలపెట్టి కన్నీళ్లు కార్చింది. దీంతో ఇంట్లో వాతావరణం ఎమోషనల్‌గా మారగా.. ఇది తర్వాత ఎపిసోడ్‌లోనూ కొనసాగనుంది. కాగా ఇంటిసభ్యులందరికీ బిగ్‌బాస్‌ బిగ్‌షాక్‌ ఇచ్చాడు. (చదవండి: ఈ మాత్రం దానికి బిగ్‌బాస్‌ షో అవసరమా!)

బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెట్టి 60 రోజులు పూర్తయినందున ఫ్యామిలీని మిస్‌ అవుతున్న ఇంటి సభ్యుల కోసం ఓ సర్‌ప్రైజ్‌ సిద్ధం చేశాడు. అయితే ఓ మెలిక కూడా పెట్టాడు. ఇంటి సభ్యులు ఎవరూ మాట్లాడటానికి వీలులేదని తెగేసి చెప్పాడు. అనంతరం వారి కుటుంబ సభ్యులను, స్నేహితులను చూపించగా ఇంటి సభ్యులందరూ ఉద్వేగానికి లోనయ్యారు. శ్రీముఖి, శివజ్యోతిలు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఇక పార్టిసిపెంట్స్‌ను కలవడానికి వచ్చిన కుటుంబ సభ్యులతో బిగ్‌బాస్‌ గేమ్‌ ఆడించనున్నాడు. అందులో భాగంగా అయిదింటిలో జోకర్‌, అయిదింటిలో ఐ లోగో ఉన్న బాక్సులను ఏర్పాటు చేశాడు. ఐ లోగో వచ్చిన వారితో గేమ్‌ ఆడించి అందులో గెలిచిన ఇద్దరికి మాత్రమే ఇంట్లోకి వెళ‍్లే అవకాశముందని చెప్పాడు. ఇప్పటికే వితిక లక్కీ చాన్స్‌ కొట్టేసింది. కాగా వితిక, రవిలకు ఇంటిసభ్యులను కలుసుకునే గోల్డెన్‌ చాన్స్‌ దక్కిందని సమాచారం!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వార్తలు

13-10-2019
Oct 13, 2019, 11:43 IST
తెలుగు బుల్లితెరపై ఆసక్తికరంగా సాగుతున్న బిగ్‌బాస్‌ 3 షోకు మరికొద్ది రోజుల్లో ఎండ్‌ కార్డ్‌ పడనుంది. దీంతో బిగ్‌బాస్‌ విజేత...
13-10-2019
Oct 13, 2019, 08:15 IST
‘రాహుల్‌ సిప్లిగంజ్‌ నాకు మంచి స్నేహితుడు. మా ఇద్దరిది స్వచ్ఛమైన స్నేహబంధం. నేను రాహుల్‌తో ప్రేమలో ఉన్నానని సోషల్‌ మీడియాలో...
12-10-2019
Oct 12, 2019, 16:34 IST
సాక్షి, హైదరాబాద్‌:  బిగ్‌బాస్‌ హౌజ్‌లో సింగర్‌ రాహుల్‌తో తనకు ఉన్న అనుబంధంపై నటి పునర్నవి భూపాలం మరోసారి స్పందించారు. ఇటీవల...
12-10-2019
Oct 12, 2019, 14:57 IST
బిగ్‌బాస్‌ పన్నెండో వారం ముగింపుకు వచ్చినప్పటికీ అసలైన మజా రావటం లేదు. షో చూస్తే నిద్ర వస్తుందే తప్ప ఇంట్రస్ట్‌...
12-10-2019
Oct 12, 2019, 09:14 IST
బిగ్‌బాస్‌ పుట్టినరోజు వేడుకలు ముగింపుకు చేరుకున్నాయి. బిగ్‌బాస్‌ బర్త్‌డే సందర్భంగా బిగ్‌బాస్‌ నిద్రపోయే సమయంలో ఇంటి సభ్యులు నిశ్శబ్దంగా ఉండాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు....
11-10-2019
Oct 11, 2019, 12:35 IST
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 కథ కంచికి చేరుతోంది. బిగ్‌బాస్‌ ఇంట్లో 80 రోజులు పూర్తయ్యాయి. ఫైనల్‌ ట్రోఫీ అందుకోడానికి మరో 20 రోజులు మాత్రమే...
11-10-2019
Oct 11, 2019, 11:27 IST
బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు హంట్‌ అండ్‌ హిట్‌ టాస్క్‌ ఇచ్చారు. ఇందులో ఇంటి సభ్యులకు వారికి తెలియని, ఇంతవరకూ చూడని వీడియోను ప్లే చేశాడు....
11-10-2019
Oct 11, 2019, 11:00 IST
బంజారాహిల్స్‌: బిగ్‌బాస్‌– 3లో టీవీ యాంకర్‌ శ్రీముఖి తళుక్కున మెరుస్తోంది. ఆమె ధరిస్తున్న దుస్తులు సరికొత్త అందాలకు చిరునామాగా మారాయి....
10-10-2019
Oct 10, 2019, 17:35 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో లేడీ మోనార్క్‌గా పేరు తెచ్చుకున్న పునర్నవి గత వారం ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే! అయితే బయటకు...
10-10-2019
Oct 10, 2019, 15:22 IST
బిగ్‌బాస్‌ 3 షో మొదటినుంచి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది..
10-10-2019
Oct 10, 2019, 12:58 IST
బిగ్‌బాస్‌ ఇంట్లో సరదాలకు బ్రేక్‌ పడింది. ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టడానికి బిగ్‌బాస్‌ రెడీ అయిపోయాడు. ఇప్పటికే 80వ రోజులోకి...
10-10-2019
Oct 10, 2019, 11:17 IST
బిగ్‌బాస్‌ ఇంట్లోకి మన్మథుడు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే! ఇక నాగ్‌ ఇంటిసభ్యులందరితో సరదాగా ఆటలు ఆడించాడు. ఇందులో భాగంగా అలీరెజా గంతలు...
09-10-2019
Oct 09, 2019, 19:09 IST
బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులు దసరా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. వీకెండ్‌లో చేసే ఎంటర్‌టైన్‌మెంట్‌కు రెట్టింపు నేటి ఎపిసోడ్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. స్పెషల్‌ గెస్ట్‌గా...
09-10-2019
Oct 09, 2019, 16:33 IST
బిగ్‌బాస్‌ ఇంట్లో ఇంటిసభ్యులకు కింగ్‌ నాగార్జున సరిపోయే క్యాప్షన్స్‌ ఇచ్చారు. అయితే నాగార్జున ఇచ్చిన క్యాప్షన్‌కు నొచ్చుకున్న ఏకైక వ్యక్తి మహేశ్‌....
09-10-2019
Oct 09, 2019, 12:51 IST
బిగ్‌బాస్‌ ఇల్లు రెట్టింపు సంతోషాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. దీనికి స్పెషల్‌ అట్రాక్షన్‌.. కింగ్‌ నాగార్జున అని చెప్పడంలో సందేహం...
09-10-2019
Oct 09, 2019, 10:47 IST
బిగ్‌బాస్‌ ఇంట్లో కొత్త జోష్‌ వచ్చినట్టయింది. దసరా సంబరాలతో ఇంటిసభ్యుల్లో నూతనోత్సాహం వెల్లువెత్తింది. ఇక వేడుకలను మరింత రక్తికట్టించడానికి బిగ్‌బాస్‌...
08-10-2019
Oct 08, 2019, 00:49 IST
ఈ టాస్క్‌లో భాగంగా గూడ్స్‌ ట్రాలీని నిర్దేశిత ప్రాంతంలో పార్కింగ్‌ చేయాలి. పార్కింగ్‌ చేయలేని సభ్యులు ఈ వారం ఇంటి నుంచి...
07-10-2019
Oct 07, 2019, 19:50 IST
పన్నెండో వారానికి గాను నామినేషన్‌ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రోమోల ప్రకారం నేటి ఎపిసోడ్‌...
07-10-2019
Oct 07, 2019, 15:35 IST
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 పన్నెండో వారంలోకి అడుగుపెట్టింది. దీంతో ఈ వారానికి గాను నామినేషన్‌ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభంకానుంది....
07-10-2019
Oct 07, 2019, 14:34 IST
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్-3లో భాగంగా పదకొండో వారం పునర్నవి భూపాలం ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. అందరూ ఊహించినట్టే పునర్నవికి తక్కువ...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top