శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది! | Bigg Boss 3 Telugu Sreemukhi As Chandramukhi In Sixth Weekend | Sakshi
Sakshi News home page

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

Sep 1 2019 6:05 PM | Updated on Sep 1 2019 6:08 PM

Bigg Boss 3 Telugu Sreemukhi As Chandramukhi In Sixth Weekend - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో వీకెండ్‌ వస్తే హౌస్‌మేట్స్‌ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వారాంతంలో వారికి మరో కొత్త మనిషి కనిపిస్తాడు. హోస్ట్‌ రూపంలో వచ్చి వారిని సరైన దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. వారు చేసే తప్పులను ఎత్తిచూపిస్తూ.. సరిదిద్దుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తాడు. అంతేకాకుండా టాస్క్‌ల పేరిట వారి మధ్య ఉండే దూరాన్ని తగ్గిస్తుంటారు. ఈ ఐదు వారాల్లో నాగార్జున హోస్ట్‌ చేస్తూ రాగా.. ఆరోవారానికి స్పెషల్‌ గెస్ట్‌ రమ్యకృష్ణ హోస్ట్‌గా వచ్చేసింది.

ఇక నిన్నటి ఎపిసోడ్‌ రమ్యకృష్ణ అందర్నీ ఆకట్టుకోగా.. నేటి ఎపిసోడ్‌లో మరింత ఫన్‌ క్రియేట్‌ చేసినట్టు తెలుస్తోంది. సీన్‌ చేయండి అనే టాస్క్‌ ఇచ్చిన రమ్యకృష్ణ.. హౌస్‌మేట్స్‌ ద్వారా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసింది. ఈ టాస్క్‌లో శ్రీముఖి.. చంద్రముఖిగా మారింది. ఇక బాబా భాస్కర్‌ తనదైన డ్యాన్సులతో, నటనతో సందడి చేశాడు. దీంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. ఇక ఎపిసోడ్‌ మొత్తం ఇలానే సందడిగా మారనుందని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement