బిగ్‌బాస్‌ తన ఆదేశాల్ని మరిచిపోయారా? | Bigg Boss 3 Telugu Order On Varun Captainship | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ తన ఆదేశాల్ని మరిచిపోయారా?

Aug 30 2019 7:11 PM | Updated on Aug 30 2019 7:51 PM

Bigg Boss 3 Telugu Order On Varun Captainship - Sakshi

బిగ్‌బాస్‌ తాను ఇచ్చిన ఆదేశాలనే మర్చిపోయారా? అనే అనుమానం కొందరు ప్రేక్షకులకు అనుమానం వస్తోంది. హౌస్‌లో మొదటి కెప్టెన్‌గా ఎన్నికైన వరుణ్‌ సందేశ్‌.. కెప్టెన్‌గా విఫలమయ్యాడని, అతడే స్వయంగా నియమాలను ఉల్లంఘించాడని కెప్టెన్‌ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మరోసారి ఇలాంటి ఉల్లంఘనలు చేయకుండా కొన్ని శిక్షలను కూడా విధించాడు.

అయితే ఆ సందర్భంలో బిగ్‌బాస్‌ అన్న మాటలను కొందరు గుర్తు చేసుకుంటున్నారు. వరుణ్‌ ఇకపై కెప్టెన్‌ కాడు అన్న బిగ్‌బాస్‌ ఆదేశాలను ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో మరెప్పుడు కెప్టెన్‌ కాలేడు అని ఆదేశించాడని, బిగ్‌బాస్‌ తన ఆదేశాల్ని మరిచిపోయారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వరుణ్‌ మళ్లీ కెప్టెన్‌ పదవీ రేసులో ఉన్నాడని అయితే అదేలా సాధ్యమని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ వారానికి మాత్రమే సంబంధించి వరుణ్‌.. ఇకపై కెప్టెన్‌ కాడు అని అన్నాడని, భవిష్యత్‌లో కూడా కెప్టెన్‌ పదవికి అనర్హుడని ప్రకటించలేదని, అయినా అంత పెద్ద తప్పు వరుణ్‌ చేయలేదని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. బిగ్‌బాస్‌ ఆ సమయంలో ఏమని ఆదేశించారో.. మీరూ ఓసారి చూడండి.

Advertisement
 
Advertisement
Advertisement