నామినేషన్‌లో ఉన్నదెవరంటే..? | Bigg Boss 3 Telugu: Nomination List In Eleventh Week | Sakshi
Sakshi News home page

నామినేషన్‌లో ఉన్నదెవరంటే..?

Oct 1 2019 10:35 PM | Updated on Oct 1 2019 10:36 PM

Bigg Boss 3 Telugu: Nomination List In Eleventh Week - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో రాళ్లే రత్నాలు అనే టాస్క్‌.. రెండో రోజూ రసవత్తరంగా సాగింది. ఈ టాస్క్‌లో భాగంగా రాళ్లు ఏరుకునేప్పుడు వితికాపై మిగతా హౌస్‌మేట్స్‌పడటంతో వారిపై ఫైర్‌ అయింది. ఈ టాస్క్‌లో అలాగే అవుతుందని.. వరుణ్‌కూడా తిరిగి ఫైర్‌ అయ్యాడు. చివరకు మళ్లీ కూల్‌ చేసేందుకు వితికాను బుజ్జగించసాగాడు.

రెండో బజర్‌ మోగే సరికి మహేష్‌ దగ్గర తక్కువ రాళ్లు ఉండటంతో నామినేషన్‌లోకి వచ్చాడు.  ఎండలో లభించే విటమిన్‌ ఏంటని ఇంటి సభ్యులంతా డిస్కషన్‌ పెట్టుకున్నారు. హౌస్‌మేట్స్‌ రాళ్ల కోసం అగచాట్లు పడుతూనే ఉన్నారు. అయితే మూడో బజర్‌మోగే సరికి పునర్నవి దగ్గర తక్కువ విలువైన రాళ్లు ఉండటంతో పునర్నవి నామినేషన్‌లోకి వెళ్లింది.

ఇక చివరి బజర్‌ మోగేసరికి వరుణ్‌-బాబా భాస్కర్‌కు సరి సమానం వచ్చాయని.. వితికా ఇచ్చిన రాళ్లతో ఇద్దరూ సరిసమానం అయ్యారు. అయితే కెప్టెన్‌ అయిన శ్రీముఖి వారిద్దరిలోంచి ఒకరిని సెలెక్ట్‌ చేసుకుంటుందని వితికా చె‍ప్పుకొచ్చింది. అయితే చివరగా.. కురిసిన వర్షంతో వరుణ్‌ తక్కువగా సంపాదించుకోవడంతో నామినేషన్‌లోకి వచ్చాడు. దీంతో రాహుల్‌, వరుణ్‌, పునర్నవి, మహేష్‌ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

Advertisement
 
Advertisement
Advertisement