స్టేజ్‌ పైనే షూ పాలిష్‌ చేసిన నాగ్‌ | Bigg Boss 3 Telugu: Nagarjuna Warning To Mahesh Vitta | Sakshi
Sakshi News home page

స్టేజ్‌ పైనే షూ పాలిష్‌ చేసిన నాగ్‌

Sep 14 2019 7:33 PM | Updated on Sep 14 2019 7:44 PM

Bigg Boss 3 Telugu: Nagarjuna Warning To Mahesh Vitta - Sakshi

బిగ్‌బాస్‌ ఏ ముహుర్తాన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ ఇచ్చాడో కానీ హౌస్‌ మొత్తం గందరగోళంగా మారింది. దెయ్యాలు రెచ్చిపోవడంతో.. మనుషులుగా ఉన్న శ్రీముఖి, మహేష్‌, పునర్నవిల మెడకు చుట్టుకుంది. ఆ టాస్క్‌లో చెత్త పర్ఫామెన్స్‌ ఇచ్చినందుకు గానూ ఆ ముగ్గురికి పనిష్మెంట్‌ను బిగ్‌బాస్‌ ఇచ్చాడు.

షూ పాలిష్‌ చేయాలంటూ ఇచ్చిన టాస్క్‌ను పునర్నవి, మహేష్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు షూ పాలిష్‌ చేయమంటాడు.. రేపు చెడ్డీలు ఉతకమంటాడు అంటూ మహేష్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. గతి లేక వచ్చామా అంటూ ఆ సమయంలో బాగానే ఫైర్‌ అయ్యాడు. అయితే ఇదే మహేష్‌ కొంపముచ్చేట్టుంది. ఈ విషయంలో నాగార్జున బాగానే సీరియస్‌ అయినట్టు కనిపిస్తోంది. స్టేజ్‌ పైనే షూ పాలిష్‌చేసిన నాగ్‌.. గేట్లు తెరిచే ఉన్నాయి బయటకు వెళ్లు అంటూ మహేష్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. మరి తరువాత ఏం జరిగిందన్నది తెలియాలంటే షో ప్రసారమయ్యే వరకు ఆగాలి.


 

Advertisement
 
Advertisement
Advertisement