బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

Bigg Boss 3 Telugu First Week Elimination Process Started - Sakshi

నామినేషన్‌లో ప్రక్రియలో మొదటి కంటెస్టెంట్‌గా ఎంటరైన రాహుల్‌కు.. నామినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు మొదట అవకాశం వచ్చింది. ఫస్ట్‌బెల్‌ మోగగానే.. శివజ్యోతి(తీన్మార్‌ సావిత్రి)ని తనకు బదులుగా రీప్లేస్‌ చేయాలనుకుంటున్నాని రాహుల్‌ తెలిపాడు. అయితే దానికి గల కారణాలు సరైనవి కావంటూ మళ్లీ రాహుల్‌నే నామినేట్‌ చేసింది హేమ. బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ఆ ముగ్గురు చర్చించుకుని నామినేట్‌ చేశారని, వాళ్లకిచ్చిన టాస్క్‌ను వారు న్యాయంగా చేశారని అందుకోసం శివజ్యోతిని సేవ్‌ చేసి రాహుల్‌నే మళ్లీ నామినేట్‌ చేయాల్సిందిగా బిగ్‌బాస్‌ను కోరింది.

రెండో బెల్‌ మెగాక వరుణ్‌ సందేశ్‌ వచ్చి.. పునర్నవిని నామినేట్‌ చేస్తున్నట్లు తెలిపాడు. ఆమె కొంచెం ఒంటరిగా ఉంటుందని, పనుల్లో కూడా సరిగా ఇన్వాల్వ్‌ కావడం లేదని, ఏదో తన ప్రపంచంలో తాను ఉంటోందని కారణాలను వివరించాడు. తాను అందరితో కలుస్తున్నానని, పనులు కూడా చేస్తున్నాని పునర్నవి వివరంచినా.. హేమ మాత్రం వరుణ్‌ సందేశ్‌ను సేవ్‌ చేసి, పునర్నవిని నామినేట్‌ చేసింది. మూడో బెల్‌కు వితికా షెరు వచ్చి.. అషూ రెడ్డిని తనకు బదులు రీప్లేస్‌ చేయాలనుకుంటున్నాని తెలిపింది. తను అందరితో సరిగా కలవడం లేదని, కొంచెం వేరుగా ఉంటుందని కారణాలను వివరించింది. అయితే తాను అంత తొందరగా కలవలేనని, అయినా అన్ని పనులను చేస్తున్నానని అందరితో కలవడానికి కాస్త సమయం పడుతుందని, తాను బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండాలని అనుకుంటున్నానని అషూ వివరించింది. అయితే అషూ రెడ్డి ఇచ్చిన వివరణ సరిగా ఉందని ఆమెను సేవ్‌ చేసి వితికా షెరునే నామినేట్‌చేసింది హేమ.

కన్నీరు పెట్టిన హిమజ
నాల్గో బెల్‌ మోగాక వచ్చిన శ్రీముఖి.. తనకు బదులుగా హిమజను రీప్లేస్‌ చేయాలనుకుంటున్నానని తెలిపారు. తనకు ఒక రెడ్‌ మార్క్‌ ఉందని, మానిటర్‌(హేమ) వేసిన ఆ రెడ్‌ మార్క్‌ వల్లే తనను రీప్లేస్‌ చేయాలనుకుంటున్నానని తెలిపింది. ఉదయాన్నే తాను పని హేమకు చెప్పిందని, తనతో కలసి సినిమాను కూడా చేశానని, తన గురించి తెలుసని హిమజ తన లైఫ్‌లో అన్నీ లైట్‌గా తీసుకుంటుందని శ్రీముఖి వివరించింది. తన గురించి శ్రీముఖికి ఏం తెలుసని అన్నీ లైట్‌గా తీసుకుంటానని చెప్పిందంటూ కన్నీరు పెట్టుకుంది. శ్రీముఖికి తాను కెరీర్‌పరంగానే తెలుసని, వ్యక్తిగతంగా తన గురించి ఆమెకు ఏం తెలుసని ప్రశ్నించింది. తానేదీ లైట్‌గా తీసుకోనని.. అందుకే తనపై ఉన్న రెడ్‌ మార్క్‌ను తొలగించుకునేందుకు ఉదయాన్నే లేచి పని చేశానని, ఆ సమయానికి ఎవరూ నిద్రలేవలేదని..  ఆ విషయం వేరే ఎవరూ చెప్పలేరని, అందుకే తానే హేమతో చెప్పానని, ఆ విషయంలో తప్పేముందంటూ ప్రశ్నించింది. ఇక ఈ వ్యవహారంలో హేమ తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. హిమజను నామినేట్‌ చేసి శ్రీముఖిని సేవ్‌ చేసింది.

చివరగా జాఫర్‌.. తనకు బదులుగా మహేష్‌ విట్టాను రీప్లేస్‌ చేయాలనుకుంటున్నానని, ఆయన కంటే తాను బెటర్‌ పర్ఫామెన్స్‌ ఇస్తాననే కారణాన్ని తెలిపాడు. తాను బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంటే ఫిజికట్‌ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొంటానని, అందరితో బాగుంటానని ఇలా తన కారణాలను మహేష్‌ వివరించుకున్నాడు. అయితే ఈ విషయంలో జాఫర్‌ను నామినేట్‌ చేస్తూ.. మహేష్‌ను సేవ్‌ చేసింది హేమ. ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉండగా.. ఐదుసార్లు మాత్రమే బెల్‌ మోగుతుందని బిగబాస్‌ తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో బాబా భాస్కర్‌కు అవకాశం రాక మిగిలిపోయాడు. అయితే బిగ్‌బాస్‌ అతనికి కూడా ఓ అవకాశాన్ని ఇచ్చాడు. మానిటర్‌(హేమ)- బాబా భాస్కర్‌ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని సేవ్‌చేసి, మరొకరిని నామినేట్‌ చేయాలని ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ ఆదేశించాడు. అయితే అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఒకరి పేరును తెలపాలని సూచించాడు. అయితే వారంతా కలసి ఓ నిర్ణయానికి వచ్చి.. బాబా భాస్కర్‌ను సేవ్‌ చేసి, హేమను నామినేట్‌ చేశారు. సో.. మొత్తంగా ఈ వారం రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్‌, హేమ నామినేట్‌ కాగా.. వీరందరిలో ఎవరోకరు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నారు.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

మరిన్ని వార్తలు

13-09-2019
Sep 13, 2019, 22:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో శుక్రవారం నాటి ఎపిసోడ్‌ సందడిగా మారింది. కొందరికీ మంచి ఫుడ్‌ ఐటమ్స్‌ లభించగా.. మరికొందరికీ పనిష్మెంట్స్‌ లభించాయి....
13-09-2019
Sep 13, 2019, 18:00 IST
అవును మహేష్‌ను బిగ్‌బాస్‌ ఎలిమినేట్‌ చేశాడు. ఇదే విషయాన్ని ఇంటి సభ్యులందరూ నమ్మేలా మహేష్‌ సీక్రెట్‌ టాస్క్‌ చేయాలి. అసలే...
13-09-2019
Sep 13, 2019, 17:08 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో అన్నింటికంటే కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లడం కష్టమైంది. ఇంటిసభ్యులకు ఏదైనా పనిష్మెంట్‌ ఇవ్వాలన్నా.. సీక్రెట్‌ టాస్క్‌ ఇవ్వాలన్నా.. అలాంటి...
13-09-2019
Sep 13, 2019, 16:17 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వారం కూడా గడిచేందుకు వచ్చేసింది. ఈ వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం...
12-09-2019
Sep 12, 2019, 23:10 IST
బిగ్‌బాస్‌ చెప్పిందే శాసనం. ఆయన ఆదేశిస్తే.. అందరూ అది పాటించాల్సిందే. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆయన మాటే శాసనం అవుతుంది. అలాంటి...
12-09-2019
Sep 12, 2019, 18:56 IST
బిగ్‌బాస్‌ అని ఊరికే అనలేదు. బిగ్‌బాస్‌ హౌస్‌లో తన ఆదేశాలను ధిక్కరించేవారిని ఊరికే వదిలిపడతాడా? తన ముందు తలొంచేలా చేస్తాడు. బిగ్‌బాస్‌...
12-09-2019
Sep 12, 2019, 17:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో రాహుల్‌ పునర్నవిలు ఎంత క్లోజ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. వీరిద్దరి వ్యవహారంపై సోషల్‌ మీడియాలో ఫన్నీ మీమ్స్‌...
12-09-2019
Sep 12, 2019, 16:52 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇప్పటికీ ఏడువారాలు పూర్తయ్యాయి. ఎనిమిదో వారంలో అడుగుపెట్టిన హౌస్‌మేట్స్‌.. నామినేషన్‌ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఎనిమిదో...
12-09-2019
Sep 12, 2019, 09:30 IST
సాక్షి, హైదరాబాద్‌: తమిళ్‌ బిగ్‌బాస్‌-3 అత్యంత ఎమోషనల్‌గా సాగుతోంది. తాజాగా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి కుటుంబసభ్యులను అనుమతించారు. దీంతో తమ ఆత్మీయులను చూసి...
11-09-2019
Sep 11, 2019, 22:52 IST
ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం..  టాస్క్‌ బిగ్‌బాస్‌కు చుక్కలు చూపిస్తోంది. ఈ టాస్క్‌లో భాగంగా పునర్నవి, మహేష్‌లు బిగ్‌బాస్‌కు ఎదురుతిరిగారు. టాస్క్‌లో...
11-09-2019
Sep 11, 2019, 16:31 IST
బిగ్‌బాస్‌ ఇంట్లో దెయ్యాలు పడ్డాయి. వాటి కోసం కోర్ట్‌ యార్డ్‌లో స్మశానాన్ని కూడా నిర్మించాడు బిగ్‌బాస్‌. ఇంటి సభ్యులను మనుషులు, దెయ్యాలు అంటూ...
10-09-2019
Sep 10, 2019, 23:00 IST
బిగ్‌బాస్‌ హౌస్‌ దెయ్యాల కోటగా మారింది. ఇంట్లోని కొంతమందిని దెయ్యాలుగా మార్చిన బిగ్‌బాస్‌.. మిగతావారిని హత్య చేసి దెయ్యాలుగా మార్చాలనే టాస్క్‌...
10-09-2019
Sep 10, 2019, 21:44 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్లు ఎలా ఆడినా.. కొందరు వారిని వ్యక్తిగతంగా ఇష్టపడితే.. మరికొందరు ఆటను ఆడే విధానాన్ని బట్టి ఫాలో...
10-09-2019
Sep 10, 2019, 18:35 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో రాహుల్‌-శ్రీముఖిల మధ్య మొదటి వారం నుంచి మొదలైన ఈ వైరం ఎన్నటికి ముగుస్తుందో అన్నది ప్రశ్నార్థకం. బయట...
10-09-2019
Sep 10, 2019, 17:05 IST
బిగ్‌బాస్‌ సీజన్‌ 3.. చూస్తుండగానే 50 రోజులు పూర్తయ్యాయి. ఇక అసలు యుద్ధం ఇప్పుడు మొదలవుతుంది. ఒక్కో రోజు గడుస్తూ ఉందంటే...
10-09-2019
Sep 10, 2019, 16:56 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో స్ట్రాంగెస్ట్‌ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న అలీ రెజా.. ఎలిమినేట్‌ అవడం బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులనే కాదు.. అతని అభిమానులను కూడా షాక్‌కు...
09-09-2019
Sep 09, 2019, 23:05 IST
నామినేషన్‌ ప్రక్రియ అంటే ఇంటి సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. సోమవారం వచ్చిందంటే ఎవరిని నామినేట్‌ చేయాలి? అంటూ ఆలోచించుకుంటూ...
09-09-2019
Sep 09, 2019, 20:05 IST
బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో ప్రధానంగా రెండు గ్రూపులు ఉన్నాయి. ఒకటి శ్రీముఖి గ్యాంగ్‌ కాగా.. రెండో వరుణ్‌ సందేశ్‌, వితికా,...
09-09-2019
Sep 09, 2019, 19:44 IST
బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్క్‌లో వందశాతం తన వంతు న్యాయం చేసే కంటెస్టెంట్‌ అలీ రెజా. ఈ మూడో సీజన్‌లో ఇచ్చే...
09-09-2019
Sep 09, 2019, 18:03 IST
బిగ్‌బాస్‌ ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టనుంది. నిన్నటి ఎపిసోడ్‌లో యాభై రోజులు పూర్తైనందుకు స్పెషల్‌ గెస్ట్‌గా నాని వచ్చాడు. ఇక నాగార్జున,...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top