బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌! | Bigg Boss 3 Telugu Fifth Week Nomination Process | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

Aug 19 2019 5:50 PM | Updated on Aug 20 2019 5:58 PM

Bigg Boss 3 Telugu Fifth Week Nomination Process - Sakshi

బిగ్‌బాస్‌ ఐదో వారంలోకి ఎంటర్‌ అయింది. ప్రతీ ఇంట్లో ఉండే అలకలు, అరుపులు, గొడవలు, ప్రేమలు అన్నీ బిగ్‌బాస్‌ హౌస్‌లో కూడా ఉన్నాయి. అయితే కంటెస్టెంట్లను ప్రశాంతంగా ఉంచితే అది బిగ్‌బాస్‌ హౌస్‌ ఎందుకు అవుతుంది. టాస్క్‌లు, నామినేషన్స్‌ అంటూ హౌస్‌మేట్స్‌ మధ్య బిగ్‌బాస్‌.. చిచ్చులు పెడుతూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ ఉంటాడు. ఇప్పటికే హేమ, జాఫర్‌, తమన్నా, రోహిణిలు ఇంటిని వీడగా ఐదో వ్యక్తిని పంపేందుకు రంగం సిద్దం చేస్తున్నాడు.

గత రెండు వారాలుగా నామినేషన్‌ ప్రక్రియలో కొత్త పద్దతులు పాటిస్తున్న బిగ్‌బాస్‌.. ఈ వారం కూడా వినూత్నంగా చేపట్టాడు. ఐదో వారానికి గానూ  ఇంటి నుంచి పంపించేందుకు చేపట్టే నామినేషన్‌ ప్రక్రియకు సంబంధించిన ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వారంలో పునర్నవి.. రాహుల్‌ను నామినేట్‌ చేసినట్టు కనపడుతోంది. ఈ హౌస్‌లో రాహుల్‌ తనకు క్లోజ్‌ ఫ్రెండ్‌ అని చెప్పుకునే పునర్నవి.. అతన్ని నామినేట్‌ చేసిందా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  మరి ప్రోమోలో చూపినట్టుగా పునర్నవి అతడ్ని నామినేట్‌ చేసిందా? ఒకవేళ నామినేట్‌ చేస్తే.. అందుకు ఎలాంటి కారణాలు చెప్పింది? అనేది తెలియాలంటే సోమవారం ఎపిసోడ్‌ ప్రసారమయ్యే వరకు ఎదురుచూడాలి.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement