బిగ్‌బాస్‌.. శిల్పా ఎలిమినేటెడ్‌! | Bigg Boss 3 Telugu Elimination: Shilpa Chakravarthy May Eliminated | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. శిల్పా ఎలిమినేటెడ్‌!

Sep 14 2019 4:14 PM | Updated on Sep 15 2019 8:53 AM

Bigg Boss 3 Telugu Elimination: Shilpa Chakravarthy May Eliminated - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలిమినేషన్‌ ప్రక్రియ అనేది ఎంత ఉత్కంఠగా సాగాల్సి ఉంటుందో.. అందుకు భిన్నంగా జరుగుతూ వస్తోంది. మొదటి వారం నుంచి ఎలిమినేట్‌ కాబోయే కంటెస్టెంట్‌ ఎవరన్నది బిగ్‌బాస్‌ కంటే ముందుగానే షోను చూసే ప్రేక్షకులకు తెలిసిపోతోంది. అయితే అవి ఊహాగానాల వరకు అయితే పర్లేదు కానీ.. అనధికారికంగా వచ్చే అధికార వార్త అవుతోంది. ఎలిమినేషన్‌ కాబోతున్నది వీరే అంటూ శనివారమే లీకవుతోంది.

అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఎనిమిదో వారంలో ఎలిమినేషన్‌కు గురయ్యే కంటెస్టెంట్‌ ఎవరన్నది ముందే తెలిసిపోయింది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి.. ఈ వారం బయటకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చిన వారంలో తనను నామినేట్‌ చేసేందుకు వీలుండదు.. కాబట్టి రెండో వారంలో అందరూ ఒకే కారణంతో ఆమెను నామినేట్‌ చేసేశారు. దీంతో శిల్పా నిష్క్రమణ తప్పదనిపిస్తోంది. అయితే ఎలిమినేట్‌ అయిన విషయం అధికారికంగా తెలియాలంటే ఆదివారం నాడు షో ప్రసారమయ్యే వరకు ఆగాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement