ఏ టర్న్‌? | Sakshi
Sakshi News home page

ఏ టర్న్‌?

Published Fri, Jun 1 2018 6:07 AM

Bhumika Chawala in Samantha Akkineni U Turn remake - Sakshi

‘‘నా దృష్టిలో ఫిట్‌నెస్‌ అంటే ఎట్రాక్టివ్‌గా కనిపించేందుకు చేసే వర్క్‌ కాదు. క్రమశిక్షణ, గౌరవం, ఆత్మవిశ్వాసం.. ఇవన్నీ ఎక్స్‌ర్‌సైజ్‌ వల్ల ఏర్పడతాయి’’ అంటున్నారు సమంత. ‘హమ్‌ ఫిట్‌ తో హై ఇండియా ఫిట్‌’ కాన్సెప్ట్‌లో భాగంగా సమంత ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఇది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆమె ఫిట్‌నెస్‌కు ఎంత ఇంపార్టెన్స్‌ ఇస్తారో. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. ఒకటీ రెండు కాదు ఏకంగా పది కేజీల బరువును వీపుపై ఉంచుకుని ఎక్స్‌ర్‌సైజ్‌ చేశారు సమంత. సినిమాల విషయంలోనే కాదు... ఫిట్‌నెస్‌ విషయంలోనూ ఆమె డెడికేషన్‌ అదుర్స్‌ కదూ. ఈ సంగతి ఇలా ఉంచితే... ఇన్‌సెట్‌లో ఉన్న ‘యు–టర్న్‌’ సినిమా ఫొటోను చూడండి.

లైఫ్టా, రైటా? ఏ టర్న్‌ తీసుకోవాలి? అని ఆలోచిస్తున్నట్లున్నారు సమంత. మరి ఫొటోలో కనిపిస్తోన్న సమంత, పాప, భూమిక ఎక్కడికి వెళ్లారు? అనేది ‘యు–టర్న్‌’ సినిమాలో చూద్దాం. సమంత, ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్, భూమిక ముఖ్య పాత్రల్లో కన్నడ హిట్‌ మూవీ ‘యు టర్న్‌’ తమిళ, తెలుగు భాషల్లో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. కన్నడ వెర్షన్‌ డైరెక్టర్‌ పవన్‌ కుమార్‌నే తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు.  శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్నారు. జర్నలిస్ట్‌ పాత్రలో సమంత, పోలీసాఫీసర్‌ పాత్రలో ఆది కనిపించనున్న ఈ సినిమా షూటింగ్‌ ఆల్మోస్ట్‌ 50 పర్సెంట్‌కి పైగా కంప్లీట్‌ అయిందని సమాచారం. అన్నట్లు ఫోటోలో సమంత, భూమికల మధ్య ఉన్న పాప... సినిమాలో భూమికకు కూతురట.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement