హాయ్‌ హైదరాబాద్‌ | bhuj, suryavanshi movie shootings in hyderabad | Sakshi
Sakshi News home page

హాయ్‌ హైదరాబాద్‌

Jun 14 2019 12:44 AM | Updated on Jun 14 2019 12:44 AM

bhuj, suryavanshi movie shootings in hyderabad - Sakshi

అజయ్‌ దేవగణ్‌, అక్షయ్‌ కుమార్‌

హిందీ హీరోలు అజయ్‌ దేవగణ్, అక్షయ్‌ కుమార్‌ హైదరాబాద్‌కు చాలాసార్లు హాయ్‌ చెప్పారు. ఇప్పుడు మళ్లీ చెప్పబోతున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరి చిత్రాల షూటింగ్‌ ఇక్కడ జరగనుంది. అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమా కోసం ఇక్కడి ఓ ప్రముఖ స్టూడియోలో  గుజరాత్‌ ప్రదేశాలను సెట్‌ వేయిస్తున్నారు. అది కూడా 1970 కాలం నాటివి కావడం విశేషం. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఈ సెట్‌లో త్వరలో ప్రారంభం కానుంది. 1971 ఇండియా–పాకిస్థాన్‌ కార్గిల్‌ వార్‌ సమయంలో గుజరాత్‌లోని భుజ్‌ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను అభిషేక్‌ దుదియా తెరకెక్కిస్తున్నారు.

బ్యాంకాక్‌ నుంచి డైరెక్ట్‌గా...
పది నిమిషాల యాక్షన్‌ సన్నివేశాల కోసం దాదాపు వారం రోజులు బ్యాంకాక్‌కు షిఫ్ట్‌ అయ్యారు అక్షయ్‌ కుమార్‌ అండ్‌ టీమ్‌. ఇప్పుడు బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చనున్నారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా ‘సూర్యవన్షీ’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ ౖహైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియలో ప్రారంభం కానుంది. కొన్ని యాక్షన్‌ సన్నివేశాలతో పాటుగా ఓ రొమాంటిక్‌ సాంగ్‌ను కూడా షూట్‌ చేయనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది
మార్చి 27న రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement