'భూతం'కు పన్ను మినహాయింపు! | 'Bhoothnath Returns' now tax free in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

'భూతం'కు పన్ను మినహాయింపు!

May 2 2014 3:42 PM | Updated on Sep 2 2017 6:50 AM

'భూతం'కు పన్ను మినహాయింపు!

'భూతం'కు పన్ను మినహాయింపు!

ఓటు హక్కు వినియోగం, ఓటు ప్రాధాన్యత గురించి చెప్పే చిత్రంగా రూపొందిన 'భూత్ నాథ్ రిటర్న్' కు పన్ను మినహాయింపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

లక్నో: ఓటు హక్కు వినియోగం, ఓటు ప్రాధాన్యత గురించి చెప్పే చిత్రంగా రూపొందిన 'భూత్ నాథ్ రిటర్న్' కు పన్ను మినహాయింపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూత్ నాథ్ రిటర్న్ కు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు అత్యున్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ఈ చిత్రానికి రవి చోప్రా, భూషన్ కుమార్ నిర్మాతలు. 
 
ఉత్తర ప్రదేశ్ లో సుమారు 200 థియేటర్లలో ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఎక్కువమంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడాలనే ఉద్దేశంతోనే పన్ను మినహాయింపు ఇచ్చామని తెలిపారు. ఇటీవల కాలంలో ఉత్తర ప్రదేశ్ లో సల్మాన్ ఖాన్ నటించిన జైహో, మాధురీ దీక్షిత్ చిత్రం 'దేడ్ ఇష్కియా' చిత్రాలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. 
 
అయితే భూత్ నాథ్ రిటర్న్ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వడంపై వివాదం నెలకొంది. ములాయంతో అమితాబ్ కుటంబానికి సన్నిహిత సంబంధాలున్న కారణంతో ఆ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ ముఖర్జీ కూడా భూత్ నాథ్ రిటర్న్ చిత్రాన్ని చూశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement