మార్పు రావాలి

Bhavana About Female-centric movies in Malayalam - Sakshi

‘‘హీరోల చుట్టూ తిరిగే కథల్లాగే హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీస్‌ కూడా ఎక్కువ రావాలి. బాలీవుడ్‌లాగా మాలీవుడ్‌లోనూ మార్పు రావాలి’’ అని పేర్కొన్నారు మలయాళ బ్యూటీ భావన. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో ఫీమేల్‌ ఓరియంటెడ్‌ మూవీస్‌ గురించి భావన మాట్లాడుతూ–‘‘ఇండస్ట్రీలో మార్పు రావాలి. కమర్షియల్‌ సినిమాల్లో కథ ఎక్కువగా హీరో చుట్టూనే తిరుగుతుంటుంది.

హీరోయిన్స్‌కు ఎక్కువ స్కోప్‌ ఉండదు. ఫీమేల్‌ సెంట్రిక్‌ మూవీస్‌ రెండు మూడు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంటాయి. ఒకవేళ ఎవరైనా హీరోయిన్‌ వరుసగా లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ చేస్తుంటే అన్ని ఫీమేల్‌ స్టోరీలు డైరెక్ట్‌గా తనకే వెళ్లిపోతుంటాయి. కానీ బాలీవుడ్‌లో అలా కాదు. టాప్‌ యాక్ట్రెస్‌ అందరికీ సమానమైన అవకాశాలు వస్తుంటాయి. మన దగ్గర కూడా అలా జరగాలి’’ అని పేర్కొన్నారు భావన.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top