అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌ | BFH movie launch | Sakshi
Sakshi News home page

అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌

Aug 3 2019 12:28 AM | Updated on Aug 3 2019 12:28 AM

BFH movie launch - Sakshi

విశ్వంత్, మాళవికా సతీషన్‌

ప్రేమ మీద నమ్మకం లేని ఓ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌గా ఉండమని ఓ అబ్బాయితో డీల్‌ కుదుర్చుకుంటుంది. ఆ వెంటనే మరో అమ్మాయి వీరిద్దరి మధ్యలోకి వస్తుంది. అప్పుడు ఎలాంటి ఆసక్తికరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయనే అంశాల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాకు ‘బీఎఫ్‌హెచ్‌’ (బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘కేరింత, మనమంతా’ చిత్రాల ఫేమ్‌ విశ్వంత్‌ హీరోగా నటిస్తున్నారు.

ఇందులో మాళవికా సతీషన్, పూజా రామచంద్రన్‌ కథానాయికలుగా నటించనున్నారు. సంతోష్‌ కంభంపాటి దర్శకత్వంలో వేణు మాధవ్‌ పెద్ది నిర్మించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత యశ్‌ రంగినేని, హీరో విజయ్‌ దేవరకొండ తండ్రి గోవర్థన్‌ దేవరకొండ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌  ఈ నెల 26న ప్రారంభం కానుంది. శివాజీరాజా, రాజా రవీందర్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్‌ సంగీతం అందించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement