డూప్‌ లేకుండా... | bellamkonda srinivas act without doup | Sakshi
Sakshi News home page

డూప్‌ లేకుండా...

Sep 13 2017 12:29 AM | Updated on Aug 3 2019 12:45 PM

డూప్‌ లేకుండా... - Sakshi

డూప్‌ లేకుండా...

యస్‌... ఫైట్‌ ఓకే అన్నారు శ్రీవాస్‌. శ్రీనివాస్‌ కూల్‌ అయ్యారు. మరి అలాంటి ఇలాంటి ఫైట్‌ కాదది.

యస్‌... ఫైట్‌ ఓకే అన్నారు శ్రీవాస్‌. శ్రీనివాస్‌ కూల్‌ అయ్యారు. మరి అలాంటి ఇలాంటి ఫైట్‌ కాదది. రిస్కీ ఫైట్‌. గాల్లో ఎగిరి తన్నడం, పెద్ద గోడ మీద నుంచి దూకడం.. వాట్‌ నాట్‌ ఎన్ని రిస్కులు తీసుకోవాలో అన్ని రిస్కులూ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో చేయించారు ఫైట్‌మాస్టర్‌ పీటర్‌ హెయిన్‌. దర్శకుడు శ్రీవాస్‌ పక్కా ప్లాన్‌తో ఈ ఫైట్‌ తీశారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీకి సంబంధించిన ఫైట్‌ ఇది.

ప్రస్తుతం పొల్లాచ్చీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. చిత్రనిర్మాత అభిషేక్‌ నామా మాట్లాడుతూ– ‘‘బలమైన కథ–కథనాలతో రూపొందుతోన్న చిత్రమిది. ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలుతో నిర్మిస్తున్నాం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి. తాజాగా పొల్లాచ్చీలో 15 రోజుల షెడ్యూల్‌లో పీటర్‌ హెయిన్‌ ఆధ్వర్యంలో భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ తీశాం. సాయిశ్రీనివాస్‌ డూప్‌ లేకుండా ఈ ఫైట్‌ సీక్వెన్స్‌లో పాల్గొనడం విశేషం. ఈ ఫైట్‌ సినిమాకి కీలకంగా నిలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్ధర్‌ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా.

Advertisement
 
Advertisement
Advertisement