ఇంతకీ రాక్షసుడు ఎవరు?

Bellamkonda Sreenivas Rakshasudu teaser release - Sakshi

అమాయకులను అన్యాయంగా, రాక్షసానందం కోసం చంపుతుంటాడు ఓ సైకో. అతడిని పట్టుకోవడానికి పరిగెత్తే పోలీస్‌. ఇంతకీ రాక్షస సైకో ఎవరు? అతడిని ఈ పోలీస్‌ పట్టుకున్నాడా? లేదా? తెలియాలంటే ‘రాక్షసుడు’ సినిమా చూడాలంటున్నారు చిత్రబృందం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా రమేశ్‌ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాక్షసుడు’. ఎ హవీష్‌ లక్ష్మణ్‌ కోనేరు ప్రొడక్షన్‌ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ శనివారం రిలీజ్‌ అయింది.

టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తుందని చిత్రబృందం తెలిపింది. ఈ సందర్బంగా నిర్మాత హవీష్‌ మాట్లాడుతూ – ‘‘తమిళ సూపర్‌హిట్‌ చిత్రం ‘రాక్షసన్‌’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాం.  ఇందులో సాయి శ్రీనివాస్‌ సీరియస్‌ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదు. షూటింగ్‌ దాదాపు పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. జూలై 18న మా చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: వెంకట్‌ సి. దిలీప్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top