బ్రేక్ తీసుకుంటున్న హీరోయిన్ | Barrymore taking break from acting | Sakshi
Sakshi News home page

బ్రేక్ తీసుకుంటున్న హీరోయిన్

Sep 26 2015 12:24 PM | Updated on Sep 3 2017 10:01 AM

బ్రేక్ తీసుకుంటున్న హీరోయిన్

బ్రేక్ తీసుకుంటున్న హీరోయిన్

హాలీవుడ్ స్టార్ హీరోయిన్ డ్రీ బారీమూర్ సినిమాలకు బ్రేక్ తీసుకుంది. చార్లెస్ ఏంజిల్స్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బారీమూర్ తన ఇద్దరు కూతుళ్లను చూసుకోవటం కోసం సినిమాలకు...

హాలీవుడ్ స్టార్ హీరోయిన్ డ్రీ బారీమూర్ సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. చార్లెస్ ఏంజిల్స్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బారీమూర్ తన ఇద్దరు కూతుళ్లను చూసుకోవటం కోసం కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలన్ననిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల వయసు నుంచే యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ కుటుంబ బాధ్యతల నేపథ్యంలో కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తోంది.

ప్రస్తుతానికి పిల్లలే తనకు ప్రపంచం అని షూటింగ్ల మూలంగా గంటలు, రోజుల తరబడి వాళ్లకు దూరంగా ఉండటం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలిపింది బారీమూర్. ఆమె నటించిన మిస్ ము ఆల్రెడీ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement