మరోసారి తెర మీదకు ‘రామారావు గారు’..! | Balakrishna Next Movie With Anil Ravipudi | Sakshi
Sakshi News home page

Sep 19 2018 3:42 PM | Updated on Sep 19 2018 3:42 PM

Balakrishna Next Movie With Anil Ravipudi - Sakshi

ప్రస్తుతం ఎన్టీఆర్‌ పనుల్లో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు కమిట్‌ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. చాలా కాలం క్రితం బాలకృష్ణ యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టుగా ప్రచారం జరిగింది. అంతేకాదు ఆ సినిమాకు ‘రామారావు గారు’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్‌ చేసినట్టుగా వార్తలు వచ్చాయి.

కానీ ఆ ప్రాజెక్ట్‌ అప్పట్లో పట్టాలెక్కలేదు. బాలయ్య, అనిల్‌ రావిపూడిలు ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీ కావటంతో రామారావుగారు ప్రాజెక్ట్ ను అందరూ మర్చిపోయారు. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్‌కు సం‍బంధించిన వార్తలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న యన్‌.టి.ఆర్‌, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్‌2 సినిమాలు పూర్తయిన తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే అది గతంలోనే అనుకున్న రామారావు గారు సినిమానేనా.. లేక మరో సినిమానా అన్న విషయంలో కూడా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement