-
మరోసారి తెర మీదకు ‘రామారావు గారు’..!
ప్రస్తుతం ఎన్టీఆర్ పనుల్లో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు కమిట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. చాలా కాలం క్రితం బాలకృష్ణ యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టుగా ప్రచారం జరిగింది. అంతేకాదు ఆ సినిమాకు ‘రామారావు గారు’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ అప్పట్లో పట్టాలెక్కలేదు. బాలయ్య, అనిల్ రావిపూడిలు ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీ కావటంతో రామారావుగారు ప్రాజెక్ట్ ను అందరూ మర్చిపోయారు. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన వార్తలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న యన్.టి.ఆర్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్2 సినిమాలు పూర్తయిన తరువాత వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే అది గతంలోనే అనుకున్న రామారావు గారు సినిమానేనా.. లేక మరో సినిమానా అన్న విషయంలో కూడా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. -
యువ దర్శకుడితో 103..?
వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణితో ఘనవిజయం సాధించిన నందమూరి బాలకృష్ణ, తరువాత స్పీడు పెంచారు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం తన 102వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న నందమూరి నటసింహం నెక్ట్స్ సినిమా కూడా ఫైనల్ చేశాడన్నా టాక్ వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన అనీల్ రావిపూడి, తరువాత సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీం సినిమాతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం రవితేజ హీరోగా రాజా ది గ్రేట్ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ యంగ్ డైరెక్టర్ బాలయ్య కోసం కథ రెడీ చేశారు. రామారావుగారు పేరుతో రెడీ చేసుకున్న కథను బాలయ్యకు వినిపించిన దర్శకుడు త్వరలోనే ఆ కథకు తుది రూపు తీసుకొచ్చేందుకు పని ప్రారంభించనున్నారు. చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్ పై చర్చలు జరుగుతుండగా.. ఇటీవల బాలకృష్ణ ఓకె చేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను గుంటూరు పంపిణీదారులు వాసవి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ నిర్మించేందుకు రెడీ అవుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. -
'రామారావు గారు'గా బాలయ్య
డిక్టేటర్ సినిమాతో ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయినా, బాలయ్య మాత్రం జోరు తగ్గించటం లేదు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే వందో సినిమా కోసం ఇద్దరు దర్శకులను లైన్లో పెట్టిన బాలయ్య నూట ఒకటో సినిమాను కూడా ఫైనల్ చేశాడు. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఆదిత్య 999 తరువాత రామారావుగారు అనే ఆసక్తికర టైటిల్‌తో సినిమాకు రెడీ అవుతున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన అనీల్ రావిపూడి, ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే బాలకృష్ణ హీరోగా మరో సినిమాను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడు అనీల్. ఇప్పటికే రామారావుగారు కథను బాలయ్యకు వినిపించిన దర్శకుడు త్వరలోనే ఆ కథకు తుది రూపు తీసుకొచ్చేందుకు పని ప్రారంభించనున్నాడు. బాలయ్య వందో సినిమా పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి, ఈ లోగా రామారావుగారు కథను పక్కాగా రెడీ చేసి బాలకృష్ణతో కూడా భారీ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా రామారావుగారి పాత్రలో బాలయ్య కనిపించనున్నాడన్న వార్తతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్‌లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్‌ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement