యువ దర్శకుడితో 103..? | Bala Krishna 103rd film with Anil ravipudi | Sakshi
Sakshi News home page

యువ దర్శకుడితో 103..?

Sep 4 2017 10:09 AM | Updated on Aug 29 2018 1:59 PM

యువ దర్శకుడితో 103..? - Sakshi

యువ దర్శకుడితో 103..?

వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణితో ఘనవిజయం సాధించిన నందమూరి బాలకృష్ణ, తరువాత స్పీడు పెంచారు.

వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణితో ఘనవిజయం సాధించిన నందమూరి బాలకృష్ణ, తరువాత స్పీడు పెంచారు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం తన 102వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న నందమూరి నటసింహం నెక్ట్స్ సినిమా కూడా ఫైనల్ చేశాడన్నా టాక్ వినిపిస్తోంది.

కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన అనీల్ రావిపూడి, తరువాత సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీం సినిమాతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం రవితేజ హీరోగా రాజా ది గ్రేట్ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ యంగ్ డైరెక్టర్ బాలయ్య కోసం కథ రెడీ చేశారు.  రామారావుగారు పేరుతో రెడీ చేసుకున్న కథను బాలయ్యకు వినిపించిన దర్శకుడు త్వరలోనే ఆ కథకు తుది రూపు తీసుకొచ్చేందుకు పని ప్రారంభించనున్నారు.

చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్ పై చర్చలు జరుగుతుండగా.. ఇటీవల బాలకృష్ణ ఓకె చేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను గుంటూరు పంపిణీదారులు వాసవి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ నిర్మించేందుకు రెడీ అవుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement