బాలయ్యా మజాకా? అందులోనూ రికార్డులే! | Balakrishna Birthday: World Record Created By Balayya Fans | Sakshi
Sakshi News home page

బాలయ్య సినిమాలే కాదు బర్త్‌డే వేడుకలు కూడా..

Jun 21 2020 1:30 PM | Updated on Jun 21 2020 1:48 PM

Balakrishna Birthday: World Record Created By Balayya Fans - Sakshi

 బాలకృష్ణ ఖాతాలో ప్రపంచ రికార్డు.. ఫ్యాన్స్‌ ఐడియా సూపర్బ్‌

నందమూరి నటసింహం బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు రికార్డులకెక్కాయి. ప్రతీసారి బర్త్‌డే వేడుకలు వేలాది అభిమానుల సమక్షమంలో జరుపుకునే బాలయ్య.. ప్రస్తుత కరోనా సంక్షోభంలో భారీ సెలబ్రెషన్స్‌కు దూరంగా ఉన్నారు. చాలా సింపుల్‌గా తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అయితే గ్లోబల్‌ నందమూరి ఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌(వైద్య, పోలీసు, పారిశుద్ద్య సిబ్బంది)కి సెల్యూట్‌ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఏకకాలంలో దాదాపు 21 వేలకు పైగా కేకులను కట్‌ చేశారు. కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ, బాలయ్య అభిమానులు, మిత్రులు, ఆత్మీయులు వారి వారి ఇళ్లలో, కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడకల్లో పాల్గొన్నారు. (బాలయ్య-బోయపాటి చిత్రంలో ‘బాల్‌రెడ్డి’?)

ఇలా జరపడం ఇదే తొలిసారి కావడంతో వండ‌ర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ మరియు జీనియ‌స్‌ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పర్యవేక్షించి ప్రపంచ రికార్డుగా ప్రకటించారు. కొంచెం పరిస్థితి సద్దుమణిగిన తర్వాత నందమూరి బాలకృష్ణకు ఆ సంస్థ ప్రతినిధులు ఈ రికార్డు ప్రతులను, ప్రశంస పత్రాన్ని అందజేయనున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘మీ కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలు జరిపి మీ సామాజిక బాధ్యతను నాకు అపూర్వకానుకగా ఇచ్చారు. మీ ప్రేమాభిమానాన్ని ప్రపంచ రికార్డు రూపంలో అందించిన మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు' అని అన్నారు. ఇక బాలయ్య ప్రస్తుతం బోయపాటి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బర్త్‌డే సందర్భంగా విడుదలైన చిత్ర ఫస్ట్‌ రోర్‌ ఎంతగా సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  (బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్‌ చూశారా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement