బాలయ్యతో బోయపాటి సినిమాకు ముహూర్తం ఫిక్స్‌ | Balakrishna And Boyapati Srinu Film From February | Sakshi
Sakshi News home page

Jan 25 2019 2:12 PM | Updated on Jan 25 2019 2:12 PM

Balakrishna And Boyapati Srinu Film From February - Sakshi

సింహా, లెజెండ్ లాంటి సూపర్‌ హిట్ సినిమాలను అందించిన బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ హిట్ కోసం రెడీ అవుతోంది. ‘యన్‌.టి.ఆర్‌’ తరువాత బోయపాటి దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నట్టుగా బాలయ్య ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభకానుందని తెలుస్తోంది.

ఇటీవల వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బోయపాటి టాక్‌ పరంగా నిరాశపరిచినా.. భారీ వసూళ్లు సాధించి మాస్‌ ఆడియన్స్‌లో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. అదే జోరులో బాలయ్యతో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు బోయపాటి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement