బాలీవుడ్లో బాలయ్య 'డిక్టేటర్'..? | bala krishna, Srivas dictator going to bollywood | Sakshi
Sakshi News home page

బాలీవుడ్లో బాలయ్య 'డిక్టేటర్'..?

Dec 8 2015 1:48 PM | Updated on Sep 3 2017 1:42 PM

బాలీవుడ్లో బాలయ్య 'డిక్టేటర్'..?

బాలీవుడ్లో బాలయ్య 'డిక్టేటర్'..?

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 99వ చిత్రం డిక్టేటర్.. ఎనౌన్స్ అయిన దగ్గర నుంచే బాలయ్య లుక్తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సినిమా...

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 99వ చిత్రం డిక్టేటర్. ఎనౌన్స్ అయిన దగ్గర నుంచే బాలయ్య లుక్తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సినిమా. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమాను, అదే స్ధాయిలో సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. తాజాగా మరో వార్త ఈ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది.

ఇంకా రిలీజ్ కూడా కాకపోయినా బాలయ్య డిక్టేటర్ సినిమాను బాలీవుడ్ రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇందుకు ప్రయాత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు తెలుగులో దర్శకత్వం వహించిన శ్రీవాస్ బాలీవుడ్లోనూ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. బాలకృష్ణ నటించిన స్టైలిష్ డాన్ పాత్రలో అజయ్ దేవగన్ను ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు డిక్టేటర్ బాలీవుడ్ రీమేక్పై చిత్రయూనిట్ ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు.

Advertisement
 
Advertisement
Advertisement