ముందే వస్తున్న బాలయ్య..? | Bala krishna, Puri Jagannath Paisa vasool Pre Pone | Sakshi
Sakshi News home page

ముందే వస్తున్న బాలయ్య..?

Jul 28 2017 1:46 PM | Updated on Sep 5 2017 5:05 PM

ముందే వస్తున్న బాలయ్య..?

ముందే వస్తున్న బాలయ్య..?

నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పైసా వసూల్.

నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పైసా వసూల్. బాలయ్య డిఫరెంట్ మేకోవర్లో కనిపిస్తున్న పైసా వసూల్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. షూటింగ్ మొదలైన రోజునే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసిన పూరి.. ఇప్పుడు సినిమాను అనుకున్న సమయం కన్నాముందే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

ఆగస్టు రెండో వారాని కల్లా పైసా వసూల్ ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే సినిమాను ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 29న కాకుండా మూడు వారాలు ముందుగానే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఫస్ట్ కాపీ రెడీ అయిన తరువాత ఎక్కువ లేట్ చేయడం కరెక్ట్ కాదని బాలయ్య సలహా ఇవ్వటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి పైసా వసూల్ ప్రీ పోన్ పై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. ముందే రిలీజ్ అవుతుందన్న ప్రచారం మాత్రం గట్టిగానే జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement