'మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా'.. స్లమ్‌డాగ్ యాక్షన్‌ టీజర్ | Puri Jagannadh and Vijay Sethupathi SlumDog Telugu Teaser out now | Sakshi
Sakshi News home page

SlumDog Teaser: విజయ్ సేతుపతి- పూరి కాంబో.. యాక్షన్‌ టీజర్ వచ్చేసింది

Jun 8 2026 6:50 PM | Updated on Jun 8 2026 6:57 PM

Puri Jagannadh and Vijay Sethupathi SlumDog Telugu Teaser out now

తమిళ స్టార్ విజయ్‌ సేతుపతి హీరోగా వస్తోన్న చిత్రం స్లమ్‌ డాగ్.. 33 టంపుల్ రోడ్. ఈ మూవీకి టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ మేకర్స్ రిలీజ్ చేశారు.

'ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కొనే జీవితాలు మావి.. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ఈ టీజర్‌లో విజయ్ సేతుపతి ఎంట్రీ, యాక్షన్ సీన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక సామాన్యుడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందనే కోణంలో ఈ కథ ఉండనుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. టీజర్‌లో పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో సంయుక్త, టబు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement