యన్‌.టి.ఆర్‌ : ఒకటా..? రెండా..? | Bala Krishna Ntr Biopic One Part or Two Parts | Sakshi
Sakshi News home page

Dec 14 2018 11:46 AM | Updated on Dec 14 2018 11:46 AM

Bala Krishna Ntr Biopic One Part or Two Parts - Sakshi

నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న బయోపిక్‌ యన్‌.టి.ఆర్‌. క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు యన్‌.టి.ఆర్ కథానాయకుడు, యన్‌.టి.ఆర్ మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తొలి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితం, రెండో భాగంలో ఎన్టీఆర్‌ రాజకీయ జీవితాలను చూపిస్తారన్న ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగా రెండు టైటిల్‌ లోగోలతో పోస్టర్‌లను కూడా రిలీజ్ చేశారు.

కానీ తాజాగా యన్‌.టి.ఆర్ ఒక్క సినిమా గానే రిలీజ్‌ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగా తాజాగా చిత్రయూనిట్ రిలీజ్‌ చేసిన పాట, పోస్టర్స్‌ సినిమా ఒక భాగమా రెండు భాగాలా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇటీవల రిలీజ్‌చేసిన ఎన్టీఆర్‌ సెకండ్‌ సింగిల్‌ పూర్తి రాజకీయ నేపథ్యంలోనే చూపించారు. తాజాగా ట్రైలర్‌ ఆడియో, రిలీజ్‌ డేట్‌లను ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లోనూ ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా ఉన్న గెటప్‌నే చూపించారు.

అంతేకాదు టైటిల్ కింద కథానాయకడు ట్యాగ్ లేకపోవటం కూడా అనుమానాలకు కారణమైంది. దీంతో యన్‌.టి.ఆర్ ఒక సినిమాగా వస్తుందా..? లేక రెండు సినిమాలుగానా అన్న చర్చ జరుగుతోంది. ఈ విషయం పై కార్లిటీ రావాలంటే చిత్రయూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement