ఎన్టీఆర్‌ బయోపిక్‌ : కొత్త పోస్టర్‌ | Bala Krishna Ntr Biopic New Poster | Sakshi
Sakshi News home page

Mar 27 2018 11:19 AM | Updated on Aug 29 2018 1:59 PM

Bala Krishna Ntr Biopic New Poster - Sakshi

ఇటీవల జై సింహా సినిమాతో ఆకట్టుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 29న ప్రారంభం కానుంది. తేజ దర్శకత్వం‍లో తెరకెక్కనున్న ఈ సినిమాను వారాహి చలనచిత్రం బ్యానర్‌తో కలిసి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. సినిమాలో ఏఏ అంశాలను చూపించబోతున్నారన్న విషయాన్ని తెలిపేలా పోస్టర్‌ ను రూపొందించారు. ఎన్టీఆర్ చిన్న నాటి విషయాలు గుర్తుగా ఎన్టీఆర్ సొంత ఊరిలోని ఇళ్లు వెండితెరపై ఎన్టీఆర్ పోషించిన అ‍ద్భుత పాత్రలతో పాటు రాజకీయ ప్రవేశం సందర్భంగా ఎన్టీఆర్ ఉపయోగించిన ప్రచార రథంతో పాటు పార్టీ జెండా కూడా ఉండేలా ఈ పోస్టర్‌ను డిజైన్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement