'బాజీరావ్ మస్తానీ' మూవీ రివ్యూ | Bajirao Masthani Movie Review | Sakshi
Sakshi News home page

'బాజీరావ్ మస్తానీ' మూవీ రివ్యూ

Dec 18 2015 10:46 AM | Updated on Sep 3 2017 2:12 PM

'బాజీరావ్ మస్తానీ' మూవీ రివ్యూ

'బాజీరావ్ మస్తానీ' మూవీ రివ్యూ

తన ప్రతీ సినిమా ఓ పెయింటింగ్లా ఉండాలని కష్టపడే సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన మరో భారీ సినిమా బాజీరావ్ మస్తానీ.

టైటిల్: బాజీరావ్ మస్తానీ
జానర్: హిస్టారికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్
తారాగణం: రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, మహేష్ మంజ్రేకర్
దర్శకత్వం, నిర్మాత, సంగీతం: సంజయ్ లీలా బన్సాలీ

తన ప్రతీ సినిమా ఓ పెయింటింగ్లా ఉండాలని కష్టపడే సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన మరో భారీ సినిమా బాజీరావ్ మస్తానీ. రామ్లీలా లాంటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ తరువాత తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చారిత్రక నేపథ్యాన్ని ఎంచుకున్నాడు సంజయ్. తన మార్క్ పొయెటిక్ నేరేషన్తో పాటు, గ్రాండ్గా తెరకెక్కించిన బాజీరావ్ మస్తానీ అభిమానులను ఆకట్టుకుందా...?

కథ :
పీష్వా బాజీరావ్గా ప్రసిద్ధి పొందిన బాజీరావ్ బల్లాల భట్ ఓటమే ఎరుగని యుద్ధవీరుడు. దాదాపు 40 యుద్ధాలలో అప్రతిహతంగా విజయాలు సాధించిన ఘనత ఆయనది. ఢిల్లీ సింహాసనం నుంచి మొఘల్ రాజులను దించేశాక.. అఖండ భారతాన్ని పరిపాలించాలని నిశ్చయించుకుంటాడు బాజీరావ్. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో తన కుటుంబసభ్యులతో కూడా పోరాడాల్సి వస్తుంది. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన బాజీరావ్.. మస్తానీ అనే ముస్లిం యువతితో ప్రేమలో పడతాడు. బాజీరావ్కు అప్పటికే కాశీబాయ్తో పెళ్లవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాజీరావ్ యుద్ధంతో పాటు తన ప్రేమలోనూ ఎలా విజయం సాధించాడన్నదే మిగతా కథ.

విశ్లేషణ :
రామ్లీలా సినిమాలో సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్న రణవీర్, దీపికాల జంట మరోసారి ఆకట్టుకుంది. బాజీరావ్గా రణవీర్ అద్భుతమైన నటన కనబరిచాడు. హావభావాలతో పాటు మరాఠీ యాసలో డైలాగ్లను చెప్పి మెప్పించాడు. తొలిసారిగా మేకప్ లేకుండా నటించిన దీపికా కూడా నటనపరంగా మంచి మార్కులే కొట్టేసింది. గ్లామరస్గా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. పాత్రపరంగా పెద్దగా అవకాశం లేకపోవటంతో ప్రియాంక చోప్రా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తన ప్రతి సినిమాలో చూపించినట్టే గ్రాండ్ విజువల్స్తో కనికట్టు చేసే ప్రయత్నం చేశాడు సంజయ్ లీలా బన్సాలీ. విజువల్గా  ఆకట్టుకున్నా.. కథా కథనాల పరంగా మాత్రం ఆశించిన స్థాయి అందుకోలేకపోయాడు. హిస్టారికల్ వార్ డ్రామాకు కావాల్సిన వేగం ఈ సినిమాలో కనిపించలేదు. ఇలాంటి చిత్రాలకు ప్రాణం పోయాల్సిన మ్యూజిక్ విషయంలో కూడా బాజీరావ్ మస్తానీ తీవ్రంగా నిరాశపరిచింది.

ప్లస్ యింట్స్ :
రణవీర్ సింగ్, దీపికా పదుకొనే
భారీ సెట్టింగులు
సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్స్ :
క్లారిటీ లేని కథనం
స్లో నేరేషన్

ఓవరాల్గా 'బాజీరావ్ మస్తానీ' విజువల్ ట్రీట్ తప్ప విషయం లేని హిస్టారికల్ ప్రేమకథ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement