250 కోట్లు దాటిన బజరంగీ | bajarangi bhaijaan crosses 250 crores mark | Sakshi
Sakshi News home page

250 కోట్లు దాటిన బజరంగీ

Jul 28 2015 6:45 PM | Updated on Sep 3 2017 6:20 AM

250 కోట్లు దాటిన బజరంగీ

250 కోట్లు దాటిన బజరంగీ

సల్మాన్ ఖాన్ హీరోగా.. రంజాన్ కానుకగా వచ్చిన బజరంగీ భాయీజాన్ సినిమా కలెక్షన్ల రికార్డులు బద్దలుకొడుతోంది. రెండో వారానికే 250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సరికొత్త విజయాల దిశగా దూసుకెళ్తోంది.

సల్మాన్ ఖాన్ హీరోగా.. రంజాన్ కానుకగా వచ్చిన బజరంగీ భాయీజాన్ సినిమా కలెక్షన్ల రికార్డులు బద్దలుకొడుతోంది. రెండో వారానికే 250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సరికొత్త విజయాల దిశగా దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ నెలంతా చాలా బాగుందని, బాహుబలి, బజరంగీ రెండు సినిమాలు బాగా ఆడాయని, ఇక దృశ్యం విడుదలైతే దాని విషయం చూడాల్సి ఉందని కూడా తరణ్ ఆదర్శ్ అన్నారు.

 

ఆ సినిమాపై కూడా మంచి అంచనాలున్నాయి. తొలుత మళయాళంలో వచ్చిన దృశ్యం.. ఆ తర్వాత వివిధ భాషల్లోకి రీమేక్ అయినా అన్నిచోట్లా మంచి విజయాలు సాధించింది. దాంతో ఇప్పుడు హిందీలో అజయ్ దేవ్గణ్, శ్రియ జంటగా ఈ సినిమాను అదే పేరుతో తీస్తున్న విషయం తెలిసిందే.

 

 

Advertisement
 
Advertisement
Advertisement