ఇక ఆ మొబైల్‌కు ప్రభాస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ | Bahubali's Prabhas Is Now Brand Ambassador for Gionee India | Sakshi
Sakshi News home page

ఇక ఆ మొబైల్‌కు ప్రభాస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌

Jun 5 2017 7:29 PM | Updated on Sep 5 2017 12:53 PM

ఇక ఆ మొబైల్‌కు ప్రభాస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌

ఇక ఆ మొబైల్‌కు ప్రభాస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌

బాహుబలితో సూపర్‌స్టార్‌ నటుడిగా ఎదిగిన యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఓ ప్రముఖ మొబైల్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు.

న్యూఢిల్లీ: బాహుబలితో సూపర్‌స్టార్‌ నటుడిగా ఎదిగిన యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఓ ప్రముఖ మొబైల్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ప్రభాస్‌ భాగస్వామ్యంతో పనిచేసేందుకు తమ కంపెనీ చాలా ఉత్సాహంతో ఉందంటూ ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ మేకర్‌ జియోనీ ఇండియా ప్రకటించింది. ఇక నుంచి ప్రభాస్‌ తమ మొబైల్‌ సెట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ పనిచేస్తారని జియోని ఇండియా సీఈవో, ఎండీ అరవింద్‌ ఆర్‌ వోరా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్పటికే జియోనీకి ప్రచారకర్తలుగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ, అలియాభట్‌, శ్రుతి హాసన్‌, దుల్కర్‌ సల్మాన్‌, దిల్జిత్‌ దోసాంజ్‌ ఉండగా ఇప్పుడు తాజాగా ప్రభాస్‌ వీరితోపాటు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ‘ ప్రభాస్‌తో కలిసి మేం పనిచేయబోతున్నామని ప్రకటించడాన్ని మేం గర్వంగా భావిస్తున్నాం. సమర్థమంతమైన బ్యాటరీలు, చక్కటి సెల్ఫీలు అనే వాటికి ప్రభాస్‌తో పనిచేసేందుకు మేం సానుకూలంగా ఉన్నాం’ అని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement