ప్రతి క్యారెక్టర్‌ సూపర్... | bahubali fans happy with movie | Sakshi
Sakshi News home page

ప్రతి క్యారెక్టర్‌ సూపర్...

Jul 10 2015 9:32 AM | Updated on Sep 3 2017 5:15 AM

ప్రతి క్యారెక్టర్‌ సూపర్...

ప్రతి క్యారెక్టర్‌ సూపర్...

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'బాహుబలి' సినిమా అభిమానుల ముందుకు వచ్చేసింది. తిరుపతిలో ఫ్యాన్స్‌ షో కోసం గత రాత్రి నుంచే థియేటర్ల వద్ద అభిమానులు పెద్దఎత్తున బారులు తీరారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'బాహుబలి' సినిమా అభిమానుల ముందుకు వచ్చేసింది. తిరుపతిలో  ఫ్యాన్స్‌ షో కోసం  గత రాత్రి  నుంచే థియేటర్ల వద్ద అభిమానులు పెద్దఎత్తున బారులు తీరారు. దీంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. గ్రూప్‌ థియేటర్స్‌ వద్ద అభిమానులపై పోలీసులు లాఠీలు కూడా ఝుళిపించారు. లాఠీ దెబ్బలు తగులుతున్నా... సినిమా చూసేవరకు అభిమానులు థియేటర్లను వదల్లేదు.

ఎట్టకేలకు శుక్రవారం ఉదయం 4గంటలకు సినిమా రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా కోసం మూడేళ్లుగా ఎదురు చూశామని అభిమానులు తెలిపారు. తిరుపతిలో 'బాహుబలి' మొదటి షో చూసిన అభిమానులు... సినిమా సూపర్‌గా ఉందంటున్నారు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్‌ బాగుందని... అందరూ ధీటైన నటన చూపారని అంటున్నారు. సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుందని కేరింతలు కొడుతున్నారు.


ఇండియన్‌ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రం బాహుబలి. సుమారు 250 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకల ముందుకు వచ్చింది. సుమారు 4000 వేల ధియేటర్స్‌లో రిలీజ్‌ అయింది. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా ఈ సినిమా చూడాలనుకున్న అభిమాని జేబు మాత్రం చిల్లు పడుతోంది.. అర్ధరాత్రి నుంచి థియేటర్ల దగ్గర పడిగాపులు..భారీ క్యూలు..తోపులాటలు.. లాఠీచార్జీలు...బ్లాక్‌మార్కెట్‌లో టిక్కెట్ల అమ్మకాలు... బాహుబలి సంగతేమోగానీ,.. అభిమానం మాత్రం బలి అవుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement