ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి | Tirupati: Police Notices To Peddireddy Ramachandra Reddy | Sakshi
Sakshi News home page

ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి

Oct 18 2026 9:41 AM | Updated on Oct 18 2026 10:28 AM

Tirupati: Police Notices To Peddireddy Ramachandra Reddy

సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. పోలీసులతో నామినేషన్లు అడ్డుకుంటున్నారని.. దేశంలో ఎక్కడ ఇలాంటి ఘటనలు జరగలేదని పెద్దిరెడ్డి అన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

నామినేషన్లు చివరి రోజు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు వేయకుండా పోలీసులతో కూటమి సర్కార్‌ కట్టడి చేస్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మారుతీ నగర్‌లో నోటీసులు ఇచ్చిన సదుం పోలీసులు.. ఇంటి నుంచి పుంగనూరుకు వెళ్ళొద్దంటూ నోటీసులో పేర్కొన్నారు.

ఎంపీ మిథున్‌రెడ్డి కుడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్లు వేయడానికి క్లియరెన్స్ సర్టిఫికెట్  కోసం అప్లై చేసిన ప్రతి ఒక్కరిని కేసుల్లో ఇరికించారు. మా నాయకుడు వైఎస్‌ జగన్‌ నియోజకవర్గం పులివెందులలో కూడా నామినేషన్లు అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.

‘‘పుంగనూరు నుంచి పులివెందుల వరకు ఇదే పరిస్థితి. టీడీపీకి సత్తా ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి.. ఇలాంటి అరాచకాలకు పాల్పడకూడదు. అధికారులు ఆలోచించుకోవాలి. ఎన్నికల అధికారులు విచారణ చేస్తే మీరే ఇబ్బందులు పడతారు, అధికారులు బలి కావద్దు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. టీడీపీ ప్రభుత్వానికి మిగిలింది ఒక రెండేళ్లు మాత్రమే. అధికారులను వాడుకుని.. గూండాలను తరలించి గొడవలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం పతనానికి నాంది మొదలయ్యింది’’ అని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌ చుట్టూ ముళ్ల కంచెలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement