సుకుమార్ మరో సినిమా కూడా ఆగిపోయిందా! | Bad Time Continues for Star Director Sukumar | Sakshi
Sakshi News home page

సుకుమార్ మరో సినిమా కూడా ఆగిపోయిందా!

Apr 4 2019 10:55 AM | Updated on Apr 4 2019 10:56 AM

Bad Time Continues for Star Director Sukumar - Sakshi

రంగస్థలం లాంటి ఘన విజయం తరువాత దర్శకుడు సుకుమార్‌ ఫుల్ బిజీ అవుతాడని అంతా ఊహించారు. సుకుమార్ కూడా అదే జోరులో సూపర్‌స్టార్ మహేష్‌తో సినిమా ఓకె చేయించుకొని ఫుల్‌ ఫాంలో కనిపించాడు. కానీ ప్రస్తుతం సీన్‌ పూర్తిగా మారిపోయినట్టుగా అనిపిస్తోంది. సుకుమార్‌తో సినిమా లేదని మహేష్‌ స్వయంగా ప్రకటించాడు.

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందన్న ఎనౌన్స్‌మెంట్ వచ్చినా ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. దర్శకుడిగా ఇలా ఉంటే నిర్మాతగానూ సుకుమార్ కెరీర్‌ అంతా ఆశాజనకంగా కనిపించటం లేదు. ఇప్పటికే కుమారి 21ఎఫ్, దర్శకుడు లాంటి సినిమాలను నిర్మించిన సుక్కు తరువాత కూడా వరుససినిమాలకు ప్లాన్ చేశాడు.

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ను పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడు. ఈ సినిమాతో పాటు నితిన్‌ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసినా వర్క్‌ అవుట్ కాలేదు. నాగశౌర్య హీరోగా కాశీ విశాల్‌ను దర్శకుడి పరిచయం చేస్తూ మరో సినిమాను ప్లాన్ చేశాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ కూడా ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి బ్యాడ్‌ ఫేజ్‌ నుంచి సుకుమార్ ఎప్పుడు బయటికి వస్తాడో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement