నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పాలి

Bad behaviour is not restricted to film industry - Sakshi

‘‘అనుకోకుండా నేను సినిమాల్లోకి వచ్చాను. కాలం గడిచే కొద్ది నా జర్నీలో సినిమాపై చాలా ఇష్టం పెరిగింది. సినిమా మాధ్యమంతో ప్రజలను ఎమోషనల్‌గా కనెక్ట్‌ చేయవచ్చని తెలుసుకున్నాను’’ అని అన్నారు కథానాయిక నిత్యామీనన్‌. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిత్యామీనన్‌ పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ఫిల్మ్‌ ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ తక్కువగా ఉంటుందనే మాటలు వినిపిస్తుంటాయి. వాటిపై మీ అభిప్రాయం ఏంటి?’ అనే ప్రశ్నకు నిత్యామీనన్‌ బదులు ఇస్తూ–‘‘ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనే మహిళలపై వేధింపులు ఉంటాయనుకుంటే పొరపాటే.

అన్ని సెక్టార్స్‌లోనూ ఉన్నాయి. నా కెరీర్‌లో ఎప్పుడూ ఒక మహిళగా నాకు భద్రత లేదని అనిపించలేదు. కానీ, కొందరు నాతో అసభ్యంగా ప్రవర్తించాలని ప్రయత్నించారు. నేను ఊరుకోలేదు. ‘మహిళలంటే గౌరవం లేదా? కాస్త హుందాగా వ్యవహరించు’ అంటూ ఘాటుగానే స్పందించాను. ఏ విషయంలోనైనా ఎంతోకొంత మన ప్రమేయం ఉన్నప్పుడే ఇతరులు జోక్యం చేసుగోలరు. అందుకే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నిర్మొహమాటంగా మన నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పాలి.. బెదిరిపోవాల్సిన అవసరం లేదు’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top