breaking news
bad behaviour
-
మేడమ్.. బ్యాడ్ వర్డ్స్‌తో వేధిస్తున్నారు..!
న్యూఢిల్లీ: రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో ఈ నెల ఒకటో తేదీన ఓ ప్రైవేట్ స్కూల్లో 4వ తరగతి చదివే విద్యార్థిని ఆత్మహత్యపై అధికారులు చేపట్టిన దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘటన జరిగిన రోజు చివరి 45 నిమిషాల్లో బాధిత బాలిక క్లాస్ టీచర్‌కు కనీసం ఐదు సార్లు తనను బ్యాడ్ వర్డ్స్‌తో క్లాస్మేట్స్ వేధిస్తున్నారనే విషయం గురించి ఫిర్యాదు చేసినట్లు సీబీఎస్ఈ ఏర్పాటు చేసిన కమిటీ దర్యాప్తులో తేలింది. ఆమె ఫిర్యాదును విన్న టీచర్ క్లాసంతా వినిపించేలా గద్దించిందే తప్ప, ఎటువంటి చర్య తీసుకోలేదు. యాజమాన్యానికి కూడా టీచర్ ఈ విషయం తెలపలేదు. దీంతో, దిక్కుతోచని స్ఙితిలో చిన్నారి తమ క్లాసు జరిగే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్కూలు భవనంలో నాలుగో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానిక నీరజా మోదీ స్కూల్లో చోటుచేసుకున్న ఘటనపై దర్యాప్తు చేపట్టిన సీబీఎస్ఈ స్కూలు యాజమాన్యానికి నోటీసు జారీ చేసింది. స్కూలులో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పడంలో విఫలైమైందని పేర్కొంది. తోటి విద్యార్థులు పదేపదే వేధింపులకు గురిచేస్తున్న విషయాన్ని బాధిత చిన్నారి మొదటిసారిగా 2024 జూలైలో తల్లిదండ్రులకు తెలిపింది. వారు టీచర్ల దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు ఏడాదిన్నరగా ఇలా వేధింపులు ఆగకుండా కొనసాగుతుండటం, చిన్నారి స్కూలులో టీచర్లకు చెప్పడం జరుగుతూనే ఉంది. టీచర్లు సర్దుకుపోవాలంటూ బాలికను గద్దించి చెబుతున్నారే తప్ప, బాధ్యులను మందలించిన పాపానపోలేదని దర్యాప్తులో వెల్లడైంది. సెపె్టంబర్ పేరెంట్స్ మీటింగ్ రోజున కూడా తమ సమక్షంలోనే కుమార్తెను తోటి బాలురు వేధించడం చూసిన తండ్రి, టీచర్లకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతా వేధింపులు ఆగలేదు. ఘటన జరిగిన రోజున బాధిత చిన్నారి స్కూలుకు వచ్చే వరకు హుషారుగానే కనిపించింది. ఉదయం 11 గంటల సమయంలో ఆమె వద్ద ఉన్న డిజిటల్ స్లేట్‌పై ఏదో రాయడం లేదా బొమ్మ వేయడం జరిగిందని, అది చూసిన తర్వాతే ఆమె తీవ్రంగా కలతకు గురైందని దర్యాప్తులో తేలింది. అలాంటివి రాయొద్దని వారికి చెప్పండని టీచర్‌కు ఫిర్యాదు చేసింది. అలా కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే ఐదుసార్లు టీచర్ల వద్దకు వెళ్లి తన ఆవేదన తెలిపింది. తగు రీతిలో స్పందించకపోగా ఆమెపైనే కేకలు వేసింది. దీంతో ఏమీ పాలుపోని పరిస్థితుల్లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నాలుగో అంతస్తుకు వెళ్లి కిందికి దూకి, తనువు చాలించిందని సీబీఎస్ఈ నివేదిక వెల్లడించింది. అభ్యంతరకరమైన మాటలు, దుర్భాషలతో వేధించడం వల్లే చిన్నారి తట్టుకోలేకపోయిందని నివేదిక గుర్తించింది. ఇదొక్కటే కాదు..స్కూలు యాజమాన్యం సీబీఎస్ఈ పలు నిబంధనలను పాటించడం లేదని గుర్తించి, నోటీసు జారీ చేసింది. -
అప్పు తీసుకున్న వ్యక్తి తల్లిని బంధించి..
జగిత్యాల: తీసుకున్న అప్పుపై వడ్డీ కట్టక జాప్యం చేస్తుండడంతో రుణం ఇచ్చిన వ్యక్తి కనీస మానవత్వం మరచి.. దాష్టీకం ప్రదర్శించిన ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పుప్పాల సందీప్ అదే గ్రామానికి చెందిన ఏశవేని గణేశ్‌కు జరుపుల సాగర్ అనే వ్యక్తి నుంచి రూ.1,12,000ను గత మార్చిలో అప్పుగా ఇప్పించాడు. అప్పు పత్రం గణేశ్‌కు బదులు సందీప్ పేరు మీద రాసుకున్నాడు. ప్రతినెలా వడ్డీ కడుతూ వస్తున్న గణేశ్ రెండునెలల నుంచి చెల్లించడం లేదు. దీంతో ఆగ్రహంతో సాగర్ ఆదివారం సందీప్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో సందీప్ తల్లి ఒక్కరే ఉన్నారు. ఆమెను చంపుతానని బెదిరించి, బూతులు తిట్టి ఇంట్లో బంధించి తాళం వేశాడు. గమనించిన స్థానిక మహిళ మీరా సాగర్‌ను మందలించి తాళం తీసి బాధితురాలిని బయటకు తీసుకొచ్చింది. సందీప్ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
టీడీపీ అసహనానికి నిదర్శనం
-
కొత్త చట్టం.. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు శిక్ష తప్పదు!
బీజింగ్: పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు మొదటగా వాళ్ల తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదన్న మాటే వినిపిస్తుంది. ఎందుకgటే పిల్లల మనస్తత్వం ఎలా ఉన్నా అంతెందుకు వాళ్లు చెడు మార్గంలో పయనించిన, లేదా ఉన్నత స్థాయికి ఎదిగినా ఆ క్రెడిట్ మొత్తం తల్లిదండ్రులకే దుక్కతుంది. ఇది సర్వ సాధారణం. అయితే ఇవి ఇప్పటివరకు మాటల వరకే పరిమితంగా ఉండేవి కానీ వీటినే చట్టంగా మార్చి శిక్ష కూడా వేస్తామంటోంది చైనా ప్రభుత్వం. చైనా తీసుకువస్తున్న ఈ చట్ట ప్రకారం.. పిల్లలు తప్పు చేస్తే.. ఇక నుంచి వాళ్ల తల్లిదండ్రులకు శిక్ష వేయనున్నారట. అందుకోసం చైనాలో సరికొత్త చట్టం రూపొందుతోంది. ఆ చట్టం ప్రకారం.. పిల్లల్లో ఏవైనా మార్పులు చోటుచేసుకున్నా, వాళ్లలో చెడు ప్రవర్తన ఉన్నా వాళ్లకు వెంటనే ఫ్యామిలీ ఎడ్యుకేషన్ గైడెన్స్ ప్రోగ్రామ్‌ను అందించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆ బిల్లును చైనా ప్రభుత్వం రివ్యూ కూడా చేస్తోంది. ఈ చట్టం ఏం చెప్తోందంటే.. తల్లిదండ్రులు పిల్లల కోసం రోజూ కాసేపు సమయం కేటాయించాలి. సమాజం గురించి చెప్పాలి. సామాజిక బాధ్యత గురించి తెలియజేయడంతో పాటు ఆచరించేలా ప్రోత్సాహించాలి. చట్టాల మీద అవగాహన కూడా తీసుకురావాలి. చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఈ రకంగా పాజిటివ్ ఆటిట్యూడ్‌ను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలిని ఆ బిల్లులో పేర్కొంది. ఆ దేశ పిల్లలు ఇటీవల ఆన్లైన్ గేమింగ్ వ్యసనంగా మారడంతో గత కొన్ని నెలలుగా, చైనా విద్యా మంత్రిత్వశాఖ మైనర్లకు పరిమిత గేమింగ్ గంటలను మాత్రమే వీలు కల్పించింది. దీని ప్రకారం శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే ఒక గంట పాటు ఆన్లైన్ గేమ్‌లు ఆడటానికి మాత్రమే వీలుంటుంది. చదవండి: Afghanistan: ఆగని తాలిబన్ల అకృత్యాలు.. మహిళా క్రీడాకారిణి తల నరికి.. -
నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పాలి
‘‘అనుకోకుండా నేను సినిమాల్లోకి వచ్చాను. కాలం గడిచే కొద్ది నా జర్నీలో సినిమాపై చాలా ఇష్టం పెరిగింది. సినిమా మాధ్యమంతో ప్రజలను ఎమోషనల్‌గా కనెక్ట్ చేయవచ్చని తెలుసుకున్నాను’’ అని అన్నారు కథానాయిక నిత్యామీనన్. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిత్యామీనన్ పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ తక్కువగా ఉంటుందనే మాటలు వినిపిస్తుంటాయి. వాటిపై మీ అభిప్రాయం ఏంటి?’ అనే ప్రశ్నకు నిత్యామీనన్ బదులు ఇస్తూ–‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మహిళలపై వేధింపులు ఉంటాయనుకుంటే పొరపాటే. అన్ని సెక్టార్స్‌లోనూ ఉన్నాయి. నా కెరీర్లో ఎప్పుడూ ఒక మహిళగా నాకు భద్రత లేదని అనిపించలేదు. కానీ, కొందరు నాతో అసభ్యంగా ప్రవర్తించాలని ప్రయత్నించారు. నేను ఊరుకోలేదు. ‘మహిళలంటే గౌరవం లేదా? కాస్త హుందాగా వ్యవహరించు’ అంటూ ఘాటుగానే స్పందించాను. ఏ విషయంలోనైనా ఎంతోకొంత మన ప్రమేయం ఉన్నప్పుడే ఇతరులు జోక్యం చేసుగోలరు. అందుకే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నిర్మొహమాటంగా మన నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పాలి.. బెదిరిపోవాల్సిన అవసరం లేదు’’ అన్నారు. -
కీచక ఉపాధ్యాయుడి సస్పెన్షన్
రామకుప్పం: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన రామకుప్పం మండలం కెంపసముద్రం జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డీఈవో పాండురంగస్వామి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కెంపసముద్రం జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కె.వరప్రసాద్ (49) తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ప్రధానోపాధ్యాయురాలు కె.శ్యామలాదేవికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆమె పీఈటీ శుభలేఖతో పాటు బాలికలను విచారించారు. తెలుగు ఉపాధ్యాయుడు పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించినట్టు నిర్ధారించుకున్నారు. అనంతరం ఉపాధ్యాయుడు వరప్రసాద్‌కు సంజాయిషీ నోటీసు ఇచ్చారు. సోమవారం లోపు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఇంతలో విద్యార్థులు 1100 నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సీఎం పేషీ నుంచి వచ్చిన సమాచారంతో స్పందించిన డీఈవో విచారణ చేపట్టాలని రామకుప్పం ఎంఈవో ధనరాజ్‌ను ఆదేశించారు. ఆయన హుటాహుటిన కెంపసముద్రం పాఠశాలకు వెళ్లి విచారించారు. అనంతరం డీఈవో పాండురంగస్వామికి నివేదిక అందజేశారు. దీంతో తెలుగు ఉపాధ్యాయుడు వరప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో పాండురంగ స్వామి ఉత్తర్వులు జారీ చేశారని, తదుపరి ఉత్తర్వులు అందేవరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఎంఈవో ధనరాజ్ తెలిపారు. -
చెడు ప్రవర్తనకు కారణం ‘కొట్టడమే’!
న్యూయార్క్: అల్లరి పనులు చేస్తే పిల్లలను ఓ దెబ్బ వేసి మందలిస్తాం. అయితే దెబ్బ తగలకూడదనే అభిప్రాయంతో చాలామంది పిల్లలకు పిరుదులపైన కొడుతుంటారు. చెంపపై కొడితే పొరపాటున కంటికి తగిలే అవకాశం ఉండడంతో స్కూల్లో మాస్టార్లు కూడా బెత్తంతో కొట్టేది అక్కడే. అయితే ఇది పిల్లల ప్రవర్తన చెడుగా మారడానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకుడు టీ జెర్షాఫ్ ఈ విషయమై మాట్లాడుతూ... ‘పిరుదులపైన కొట్టడడం వల్ల పిల్లల ప్రవర్తనలో మార్పు రావడాన్ని చాలామందిలో పరిశీలించాం. అవమానకరంగా కొట్టడం పిల్లల ప్రవర్తనలో మార్పు రావడానికి ఓ కారణమని తేలింద’న్నారు. ప్రవర్తనామార్పుపై యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేసిన వివరాలను సైకలాజికల్ జర్నల్‌లో ప్రచురించారు. అయితే పిల్లల్లో ప్రవర్తన మార్పునకు మాత్రం కొట్టడమేనని, అందులో అవమానకరంగా కొట్టడం వల్ల పిల్లల్లో ప్రవర్తన మరింత చెడుగా మారుతుందని గుర్తించారు. ‘పిల్లల్ని కొట్టడడమనే సంప్రదాయం పాఠశాల నుంచే వచ్చిందనే విషయం మా పరిశోధనలో తేలింది. మాస్టార్లు కొడతారనే భయంతో పిల్లలు అల్లరి చేయకుండా ఉండడాన్ని గమనించిన పేరెంట్స్.. తాము కూడా అలాగే కొడితే పిల్లలు అదుపాజ్ఞలలో ఉంటారని భావించారు. అందుకే మాస్టారు కొట్టిన చోటే తల్లిదండ్రులు కూడా కొట్టడం మొదలైంది. ఇది పిల్లల ప్రవర్తనలో మార్పులు తీసుకొస్తోంద’ని పరిశోధకుల్లో ఒకరైన ఎలిజబెత్ అన్నారు. -
క్షమాపణ చెప్పిన సీనియర్ నటుడు
లాస్ ఏంజెలెస్: గతంలో చేసిన తప్పులకు హాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు మెల్ గిబ్సన్ క్షమాపణ కోరాడు. తాను గతంలో చేసిన వివాదస్పద ప్రకటనలు, చర్యలకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నాడు. 60 ఏళ్ల మెల్ గిబ్సన్ 2006లో పోలీసు మహిళా అధికారిపై చేసిన వ్యాఖ్యలతో అపఖ్యాతి పాలయ్యాడు. మద్యం మత్తులో జాతివివక్ష వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురైయ్యాడు. మరొపక్క తనను గృహహింసకు గురిచేశాడని అతడి మాజీ సహచరి ఒక్సనా గ్రీగోరివా ఆరోపించడంతో మెల్ గిబ్సన్ ఇమేజ్ పాతాళానికి పడిపోయింది. దురలవాట్ల నుంచి బయటపడ్డానని, తన గత ప్రవర్తనకు బాధ పడుతున్నానని గిబ్సన్ చెప్పాడు. గత పదేళ్లలో తనలో చాలా మార్పు వచ్చిందన్నాడు. మద్యం అలవాటు మానేశానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని వెల్లడించాడు. చేసిన తప్పులకు తనకు తానుగా క్షమాపణ చెబుతున్నానని అన్నాడు. -
మళ్ళీ వార్తల్లో నిలిచిన అంజలి


