క్షమాపణ చెప్పిన సీనియర్ నటుడు | Mel Gibson 'sorry' for past bad behaviour in past | Sakshi
Sakshi News home page

క్షమాపణ చెప్పిన సీనియర్ నటుడు

Sep 9 2016 10:36 AM | Updated on Sep 4 2017 12:49 PM

క్షమాపణ చెప్పిన సీనియర్ నటుడు

క్షమాపణ చెప్పిన సీనియర్ నటుడు

గతంలో చేసిన తప్పులకు హాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు మెల్ గిబ్సన్ క్షమాపణ కోరాడు.

లాస్ ఏంజెలెస్: గతంలో చేసిన తప్పులకు హాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు మెల్ గిబ్సన్ క్షమాపణ కోరాడు. తాను గతంలో చేసిన వివాదస్పద ప్రకటనలు, చర్యలకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నాడు. 60 ఏళ్ల మెల్ గిబ్సన్ 2006లో పోలీసు మహిళా అధికారిపై చేసిన వ్యాఖ్యలతో అపఖ్యాతి పాలయ్యాడు. మద్యం మత్తులో జాతివివక్ష వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురైయ్యాడు. మరొపక్క తనను గృహహింసకు గురిచేశాడని అతడి మాజీ సహచరి ఒక్సనా గ్రీగోరివా ఆరోపించడంతో మెల్ గిబ్సన్ ఇమేజ్ పాతాళానికి పడిపోయింది.

దురలవాట్ల నుంచి బయటపడ్డానని, తన గత ప్రవర్తనకు బాధ పడుతున్నానని గిబ్సన్ చెప్పాడు. గత పదేళ్లలో తనలో చాలా మార్పు వచ్చిందన్నాడు. మద్యం అలవాటు మానేశానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని వెల్లడించాడు. చేసిన తప్పులకు తనకు తానుగా క్షమాపణ చెబుతున్నానని అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement