-
ఇక పిల్లల్ని పుట్టించలేను: టాప్‌హీరో
లాస్ ఎంజిల్స్: త్వరలో తొమ్మిదో బిడ్డకు తండ్రి కాబోతున్న హాలీవుడ్ మహానటుడు మెల్ గిబ్సన్ ఇటీవల తనను కలిసిన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 60వ పడిలో ఉన్న గిబ్సన్..తానింకా అసలిపోలేదని, అయితే మున్ముందు పిల్లల్ని పుట్టించే ఆలోచన ఏమాత్రమూ లేదని చెప్పారు. గర్ల్ ఫ్రెండ్ రోసాలిండ్ రోజ్ (26) కడుపులో పెరుగుతున్న పాపాయి ఎప్పుడెప్పుడు భూమిమీదికి వస్తుందాని కుటుంబమంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గిబ్సన్ మొదటి పెళ్లి 1980లో రాబిన్ మూర్ తో జరిగింది. ఆరుగురు పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత గిబ్సన్.. ఒకానా గ్రిగోరివాను రెండో పెళ్లి చేసుకున్నడు. ఇద్దరు పిల్లలు పుట్టాక రెండో పెళ్లి కూడా పెటాకులైంది. ఆ తర్వాత కొంతకాలం ఒంటరిగా జీవంచిన హీరో.. గడిచిన రెండేళ్ల నుంచి రోసాలిండ్ రోజ్ తో సహజీవనం చేస్తున్నారు. ఈ ఇద్దరికి పుట్టబోయే బిడ్డే గిబ్సన్ తొమ్మిదో సంతానం. గిబ్సన్ సంతానం పేర్లు: హాన(36), క్రిస్టినా(34), ఎడ్వర్డ్(34), విలియం(31), లూయిస్(28), మిలో(28), థామస్(17), లూనా(6). పుట్టబోయే పాపాయిపేరు ఇంకా ఖరారుచేయలేదట! -
తొమ్మిదోబిడ్డకు తండ్రికాబోతున్న నటుడు
హాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత మెల్ గిబ్సన్ 60వ ఏట 9వ బిడ్డకు తండ్రికాబోతున్నాడు. గిబ్సన్ ద్వారా ఆయన గాళ్‌ఫ్రెండ్ రోసాలిండ్ రోజ్ (26) బిడ్డకు జన్మనివ్వనుంది. గిబ్సన్‌కు ప్రస్తుతం ఎనిమిదిమంది సంతానం ఉన్నారు. మాజీ భార్య రాబిన్ మూరే ద్వారా ఏడుగురు పిల్లలు పుట్టారు. గిబ్సన్ తొలిసంతానం థామస్‌కు 17 ఏళ్లు. 1980లో రాబిన్‌ను వివాహం చేసుకున్న ఆయన 2006 వరకు ఆమెతో కలిసున్నాడు. మూరే నుంచి విడిపోయాక ఒక్సానా గ్రిగోరీవాతో కొంతకాలం డేటింగ్ చేశాడు. వీరిద్దరికీ ఆరేళ్ల కూతురు ఉంది. ఒక్సానాతో కూడా బంధాన్ని కటీఫ్ చేసుకున్న గిబ్సన్ రోజ్‌కు దగ్గరయ్యాడు. స్క్రిప్ట్ రైటర్ అయిన రోజ్ 2015లో గిబ్సన్ ప్రొడక్షన్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత ఇద్దరూ సన్నిహితులయ్యారు. ప్రస్తుతం రోజ్‌తో డేటింగ్లో ఉన్న గిబ్సన్ గత మేలో ఆమెతో కలసి కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సందడి చేశాడు. రోజ్ ప్రెగ్నెసీతో ఉన్నట్టు వారి స్నేహితుడు చెప్పాడని ఓ మేగజైన్ వెల్లడించింది. -
క్షమాపణ చెప్పిన సీనియర్ నటుడు
లాస్ ఏంజెలెస్: గతంలో చేసిన తప్పులకు హాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు మెల్ గిబ్సన్ క్షమాపణ కోరాడు. తాను గతంలో చేసిన వివాదస్పద ప్రకటనలు, చర్యలకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నాడు. 60 ఏళ్ల మెల్ గిబ్సన్ 2006లో పోలీసు మహిళా అధికారిపై చేసిన వ్యాఖ్యలతో అపఖ్యాతి పాలయ్యాడు. మద్యం మత్తులో జాతివివక్ష వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురైయ్యాడు. మరొపక్క తనను గృహహింసకు గురిచేశాడని అతడి మాజీ సహచరి ఒక్సనా గ్రీగోరివా ఆరోపించడంతో మెల్ గిబ్సన్ ఇమేజ్ పాతాళానికి పడిపోయింది. దురలవాట్ల నుంచి బయటపడ్డానని, తన గత ప్రవర్తనకు బాధ పడుతున్నానని గిబ్సన్ చెప్పాడు. గత పదేళ్లలో తనలో చాలా మార్పు వచ్చిందన్నాడు. మద్యం అలవాటు మానేశానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని వెల్లడించాడు. చేసిన తప్పులకు తనకు తానుగా క్షమాపణ చెబుతున్నానని అన్నాడు. -
వారం ముందే సిల్వస్టర్ స్టాలెన్ చిత్రం ఇంటర్నెట్ లో లీక్
లాస్ ఎంజెలెస్: అత్తారింటికి దారేది చిత్రానికి ఎదురైన అనుభవమే సిల్వెస్టర్ స్టాలెన్ నటించిన 'ది ఎక్స్ పాండాబుల్స్ 3' సినిమాకు ఎదురైంది. విడుదలకు వారం రోజుల ముందే 'ది ఎక్స్ పాండాబుల్స్ 3' చిత్రం ఆన్ లైన్ లో లీకవ్వడం హాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. పైరసీ వెబ్ సైట్ల ద్వారా కేవలం 24 గంటల్లోనే ఆన్ లైన్ లో ఇప్పటికే 189000 మంది డౌన్ లోడ్ చేసుకున్నట్టు వివరాలు అందాయని డిస్టిబ్యూటర్ వెరైటీ లైయన్స్ గేట్ మీడియాకు వెల్లడించారు. పైరసీ కాపీ క్లారిటీ అస్పష్టంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేశారు. జూలై 23 తేది బుధవారం నుంచి గురువారం టొరెంటో షేరింగ్ సైట్స్ పైరసీ కాపీలు లభ్యమయ్యాయని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో సిల్వస్టర్ స్టాలెన్ జాసన స్టాథమ్, అంటానియో బాండెరస్, జెల్ లీ, ఆర్నాల్డ్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్, మెల్ గిబ్సన్ తదితరులు నటించారు. 2009లో ఎక్స్-మెన్ ఆరిజిన్స్ చిత్రం కూడా లీకైంది. తాజాగా లీకైన 'ది ఎక్స్ పాండాబుల్స్ 3' సుమారు 15 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని ఫాక్స్ డిస్టిబ్యూటర్ కంపెనీ తెలిపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement