ఇక పిల్లల్ని పుట్టించలేను: టాప్హీరో | Mel Gibson set to welcome his ninth baby soon | Sakshi
Sakshi News home page

ఇక పిల్లల్ని పుట్టించలేను: టాప్హీరో

Oct 25 2016 2:43 PM | Updated on Sep 4 2017 6:17 PM

ఇక పిల్లల్ని పుట్టించలేను: టాప్హీరో

ఇక పిల్లల్ని పుట్టించలేను: టాప్హీరో

త్వరలో తొమ్మిదో బిడ్డకు తండ్రి కాబోతున్న హాలీవుడ్ మహానటుడు మెల్ గిబ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లాస్ ఎంజిల్స్: త్వరలో తొమ్మిదో బిడ్డకు తండ్రి కాబోతున్న హాలీవుడ్ మహానటుడు మెల్ గిబ్సన్ ఇటీవల తనను కలిసిన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 60వ పడిలో ఉన్న గిబ్సన్..తానింకా అసలిపోలేదని, అయితే మున్ముందు పిల్లల్ని పుట్టించే ఆలోచన ఏమాత్రమూ లేదని చెప్పారు. గర్ల్ ఫ్రెండ్ రోసాలిండ్ రోజ్ (26) కడుపులో పెరుగుతున్న పాపాయి ఎప్పుడెప్పుడు భూమిమీదికి వస్తుందాని కుటుంబమంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

గిబ్సన్ మొదటి పెళ్లి 1980లో రాబిన్ మూర్ తో జరిగింది. ఆరుగురు పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత గిబ్సన్.. ఒకానా గ్రిగోరివాను రెండో పెళ్లి చేసుకున్నడు. ఇద్దరు పిల్లలు పుట్టాక రెండో పెళ్లి కూడా పెటాకులైంది. ఆ తర్వాత కొంతకాలం ఒంటరిగా జీవంచిన హీరో.. గడిచిన రెండేళ్ల నుంచి రోసాలిండ్ రోజ్ తో సహజీవనం చేస్తున్నారు. ఈ ఇద్దరికి పుట్టబోయే బిడ్డే గిబ్సన్ తొమ్మిదో సంతానం. గిబ్సన్ సంతానం పేర్లు: హాన(36), క్రిస్టినా(34), ఎడ్వర్డ్(34), విలియం(31), లూయిస్(28), మిలో(28), థామస్(17), లూనా(6). పుట్టబోయే పాపాయిపేరు ఇంకా ఖరారుచేయలేదట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement