300 స్క్రీన్లలో రేపే విడుదల..! | baahubali team all set to release trailer, creates big hype | Sakshi
Sakshi News home page

300 స్క్రీన్లలో రేపే విడుదల..!

Mar 15 2017 5:13 PM | Updated on Sep 5 2017 6:10 AM

బాహుబలి-2 సినిమా ఎప్పుడు విడుదల అవుతుందన్న చర్చ కంటే, దాని ట్రైలర్ ఎలా ఉండబోతోందన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతోంది.

బాహుబలి-2 సినిమా ఎప్పుడు విడుదల అవుతుందన్న చర్చ కంటే, దాని ట్రైలర్ ఎలా ఉండబోతోందన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతోంది. సాధారణంగా ట్రైలర్లు అంటే అర నిమిషం నుంచి ఒక నిమిషం వరకు ఉంటాయి గానీ, బాహుబలి మాత్రం సినిమా పేరుకు తగ్గట్లే ఏకంగా 2 నిమిషాల 20 సెకన్లతో పెద్ద ట్రైలర్ విడుదల చేస్తోంది. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో దీన్ని విడుదల చేస్తామని చెబుతున్నారు. ప్రభాస్ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న ఈ సినిమా మీద మొదటి భాగం కంటే ఎక్కువ అంచనాలున్నాయి.

సోషల్ మీడియాలో సాయంత్రం 5 గంటలకు విడుదల చేయడంతో పాటు.. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 300 స్క్రీన్లలో కూడా ఈ ట్రైలర్‌ను గురువారమే విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఉత్కంఠను కూడా ట్విట్టర్‌లో పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా బాహుబలి ట్విట్టర్ పేజీలో ఈ సినిమా ట్రైలర్ విడుదల గురించి మరో ట్వీట్ చేశారు. మరొక్క 24 గంటల్లో విడుదల అవుతోందని, అంతా సిద్ధంగా ఉండాలని అందులో చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement