breaking news
baahubali trailer
-
300 స్క్రీన్లలో రేపే విడుదల..!
బాహుబలి-2 సినిమా ఎప్పుడు విడుదల అవుతుందన్న చర్చ కంటే, దాని ట్రైలర్ ఎలా ఉండబోతోందన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతోంది. సాధారణంగా ట్రైలర్లు అంటే అర నిమిషం నుంచి ఒక నిమిషం వరకు ఉంటాయి గానీ, బాహుబలి మాత్రం సినిమా పేరుకు తగ్గట్లే ఏకంగా 2 నిమిషాల 20 సెకన్లతో పెద్ద ట్రైలర్ విడుదల చేస్తోంది. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో దీన్ని విడుదల చేస్తామని చెబుతున్నారు. ప్రభాస్ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న ఈ సినిమా మీద మొదటి భాగం కంటే ఎక్కువ అంచనాలున్నాయి. సోషల్ మీడియాలో సాయంత్రం 5 గంటలకు విడుదల చేయడంతో పాటు.. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 300 స్క్రీన్లలో కూడా ఈ ట్రైలర్‌ను గురువారమే విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఉత్కంఠను కూడా ట్విట్టర్లో పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా బాహుబలి ట్విట్టర్ పేజీలో ఈ సినిమా ట్రైలర్ విడుదల గురించి మరో ట్వీట్ చేశారు. మరొక్క 24 గంటల్లో విడుదల అవుతోందని, అంతా సిద్ధంగా ఉండాలని అందులో చెప్పారు. Just ONE day left for the Trailer of #Baahubali2 - The Conclusion on social media at 5 pm.. Brace yourselves! pic.twitter.com/IKvYecHuVZ — Baahubali (@BaahubaliMovie) 15 March 2017 -
డాల్బీ ఎట్మాస్ సౌండ్ తో 'బాహుబలి' ట్రైలర్
ముంబై: రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా హిందీ ట్రైలర్ ను బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ జూన్ 1న విడుదల చేయనున్నారు. కటింగ్ ఎడ్జ్ డాల్బీ ఎట్మాస్ మిక్సింగ్‌తో రూపొందించిన ట్రైలర్ ప్రేక్షకులకు హై క్వాలిటీ సౌండ్ ఎక్స్పీరియన్స్ అందించనుంది. తెలుగులో తొలిసారిగా 'బాహుబలి' కోసం ఈ టెక్నాలజీ వాడారు. ప్రసిద్ధ ఇంజనీర్ పి.ఎం. సతీష్ ఈ సినిమా సౌండ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్ బాధ్యతలు చూస్తున్నారు. రెండు నిమిషాల 5 సెకన్ల ఈ ఫస్ట్ థియేటరికల్ ట్రైలర్ అత్యద్భుతంగా ఉందని ఇప్పటికే చూసినవారు చెబుతున్నారు. 'బాహుబలి' హిందీ వెర్షన్‌ను కరణ్ జోహార్ సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 31న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే భారీ వేడుకలో 'బాహుబలి' ఫస్ట్‌పార్ట్ తెలుగు, తమిళ పాటలు విడుదల చేయనున్నారు. జూలై 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.