డాల్బీ ఎట్మాస్ సౌండ్ తో 'బాహుబలి' ట్రైలర్ | 'Baahubali' trailer to launch in Dolby Atmos sound | Sakshi
Sakshi News home page

డాల్బీ ఎట్మాస్ సౌండ్ తో 'బాహుబలి' ట్రైలర్

May 27 2015 12:11 PM | Updated on Sep 3 2017 2:47 AM

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా హిందీ ట్రైలర్ ను బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ జూన్ 1న విడుదల చేయనున్నారు.

ముంబై: రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా హిందీ ట్రైలర్ ను బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ జూన్ 1న విడుదల చేయనున్నారు. కటింగ్ ఎడ్జ్ డాల్బీ ఎట్మాస్ మిక్సింగ్‌తో రూపొందించిన ట్రైలర్ ప్రేక్షకులకు హై క్వాలిటీ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. తెలుగులో తొలిసారిగా 'బాహుబలి'  కోసం ఈ టెక్నాలజీ వాడారు.
 

ప్రసిద్ధ ఇంజనీర్ పి.ఎం. సతీష్ ఈ సినిమా సౌండ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్ బాధ్యతలు చూస్తున్నారు. రెండు నిమిషాల 5 సెకన్ల ఈ ఫస్ట్ థియేటరికల్ ట్రైలర్ అత్యద్భుతంగా ఉందని ఇప్పటికే చూసినవారు చెబుతున్నారు. 'బాహుబలి' హిందీ వెర్షన్‌ను కరణ్ జోహార్ సమర్పిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నెల 31న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే భారీ వేడుకలో 'బాహుబలి' ఫస్ట్‌పార్ట్ తెలుగు, తమిళ పాటలు విడుదల చేయనున్నారు. జూలై 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement