బాహుబలి 2 : మరో మైల్స్టోన్కు చేరువలో..! | baahubali 2 nearing rs 1500 crore collection Mark | Sakshi
Sakshi News home page

బాహుబలి 2 : మరో మైల్స్టోన్కు చేరువలో..!

May 17 2017 3:19 PM | Updated on Aug 11 2019 12:52 PM

బాహుబలి 2 : మరో మైల్స్టోన్కు చేరువలో..! - Sakshi

బాహుబలి 2 : మరో మైల్స్టోన్కు చేరువలో..!

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించిన ఈ విజువల్ వండర్, ఇప్పుడు మరో అరుదైన ఘనతకు చేరువైంది. ఇప్పటికే 1450 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా వారాంతానికి 1500 కోట్ల మార్క్ ను కూడా దాటేయనుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమాగా బాహుబలి 2 రికార్డ్ సృష్టించనుంది.

మొదటి రెండు వారాల్లో భారత్ లోనే 1012 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా ఓవర్ సీస్ తో కలిపి 1250 కోట్ల సాధించింది. తాజా లెక్కల ప్రకారం 19 రోజుల్లో బాహుబలి 2  భారత్ లో 1189 కోట్లు, ఓవర్ సీస్ లో 261 కోట్ల వసూళ్లు సాధించి 1450 కోట్ల మార్క్ కు చేరిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. మరో రెండు రోజుల్లో 1500 కోట్ల మార్క్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ప్రభాస్, రానాలు ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ రికార్డ్స్ అన్నింటినీ చెరిపేస్తూ దూసుకుపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement