‘ఈ ప్రపంచానికి నీ వయసు చెప్పలేను’ | Ayushmann Khurrana Wishes to his Dad Birthday In Instagram | Sakshi
Sakshi News home page

‘ఈ ప్రపంచానికి నీ వయసు చెప్పలేను’

May 19 2020 12:51 PM | Updated on May 19 2020 12:59 PM

Ayushmann Khurrana Wishes to his Dad Birthday In Instagram - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా విభిన్న పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆయుష్మాన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తి, వృత్తిగత విషయాలు అభిమానులతో పంచుకుంటూ అలరిస్తారు. అయితే ఆయుష్మాన్‌ సోమవారం తన తండ్రి పీ ఖురానాకి బర్త్‌డే విషేష్‌ తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘ప్రపంచలోనే గొప్ప తండ్రివి నువ్వు. నీకు హ్యాపీ బర్త్‌ డే. నీవు నాకు గొప్ప తెలివిని, లక్ష్యాన్ని ఇచ్చావు. ఇష్టమైన రంగంలో ఎప్పడూ కష్టపడి శ్రమించాలని చేతులను ఇచ్చావు. నేను ఈ ప్రపంచానికి నీ వయసు చెప్పలేను. ఎందుకంటే నేను చెప్పినా ఎవరు నమ్మరు’ అని కామెంట్‌ జతచేశారు. (అభిమానులకు శుభవార్త చెప్పిన సోనాలి)

దీనికంటే ముందు ఆయుష్మాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రికి సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేసి.. ‘హ్యాపీ బర్త్‌ డే పప్పా. చివరికి నువ్వు 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టావు. ఇదే నీ నిజమైన వయసు’ అంటూ ఆయన కామెంట్‌ జతచేశారు. ఆయుష్మాన్‌ తండ్రి పీ ఖురానాకు బాలీవుడ్‌ సినీ సెలబ్రిటీలు అర్జున్‌ కపూర్‌, నుస్రత్ బరుచా, నేహా ధుపియాతో పాటు పలువురు ప్రముఖులు బర్త్‌డే విషేష్‌ తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఆయుష్మాన్‌, అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ‘గులాబో సితాబో’ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గతంలో ఉన్న షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 12న పేక్షకుల ముందుకు రావల్సింది. కానీ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు అన్ని మూసి ఉండటంతో ఈ సినిమాను దిగ్గజ అమేజాన్‌ ప్రైమ్‌లో జూన్‌ 12న విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు సూజిత్‌ సర్కార్‌ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ అమలవుతున్న ఈ సమయంలో ఆయుష్మాన్‌ ముంబైలో ఇంటికే పరిమితమై కుంటుంబంతో గడుపుతున్నారు. (సల్మాన్‌ను టార్గెట్‌ చేసిన సింగర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement