సల్మాన్‌ను టార్గెట్‌ చేసిన సింగర్‌ సోనా | Sona Mohapatra Reacted On Tiktok Video Violence | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ను టార్గెట్‌ చేసిన సింగర్‌ సోనా

May 19 2020 12:16 PM | Updated on May 19 2020 2:32 PM

Sona Mohapatra Reacted On Tiktok Video Violence  - Sakshi

ముంబై: వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌లో‌ హింసాత్మక వీడియోలపై బాలీవుడ్‌ సింగర్‌ సోనా మెహపాత్రా స్పందించారు. మన సమాజంలో మహిళలపై హింసలు సర్వసాధారణమైనవని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇటీవల అమీర్‌ సిద్ధీఖీ సోదరుడు ఫైజల్‌ సిద్దీఖీ చేసిన ఓ టిక్‌టాక్‌ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వీడియోలో తనని వదిలేసిన యువతిపై ప్రతీకారం తీర్చుకునెందుకు ఆమె ముఖంపై యాసిడ్‌ పోసినట్లు చూపించిన ఈ వీడిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుపడుతున్నారు. ఈ వీడియో మహిళలపై యాసిడ్‌ దాడిని ప్రొత్సహించేలా ఉందని, దీనిని తొలగించాలంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. (ఆర్జీవీ ట్వీట్‌.. మండిపడ్డ సింగర్‌!)

ఇక అతడి ట్వీట్‌కు సోనా మద్దతునిస్తూ... ‘‘డియర్‌ @aaliznat మునుపుటికీ, ఇప్పటికి మహిళలను కించపరచడం, హింసించడం ఏమాత్రం మారలేదు. అదే మన స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ను చూస్తునే ఉన్నాం. ఆయన తన స్నేహితురాళ్ల నుదుటిపై బహిరంగంగా సీసాలు పగలగొట్టిన ఘటనలను పలుమార్లు చుశాం. అయినప్పటికీ ఆయన ఓ పెద్ద హీరో?. ఇది ఇప్పటికైన ఆపడం అవసరం’’ అంటూ ఆమె ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే సోనా సల్మాన్‌పై ఆరోపణలు చేయడం ఇది మొదటిసారి కాదు. ఇది వరకు కూడా భారత్‌ సినిమా నుంచి చివరి నిమిషంలో ప్రియాంక చోప్రా తప్పుకొవడంపై కూడా ఆమె సల్మాన్‌పై ఆరోపణలు చేశారు. ‘ప్రియాంక తన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ నిర్ణయంతో తను ఇతర అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచారు’ అని అన్నారు. కాగా అమిర్‌ సుద్దీఖీ సోదరుడు ఫైజల్‌ సోదరుడి టిక్‌టాక్‌ వీడియో హింసను ప్రేరింపించిందిగా ఉండటంతో ఆ సంస్థ  దానిని తొలగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement