అభిమానులకు శుభవార్త చెప్పిన సోనాలి | Sakshi
Sakshi News home page

అభిమానులకు శుభవార్త చెప్పిన సోనాలి

Published Tue, May 19 2020 10:15 AM

Sonalee Kulkarni Announces Her Engagement - Sakshi

మరాఠి నటి సోనాలి కులకర్ణి తన పుట్టినరోజు(మే 18) సందర్భంగా అభిమానులకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తను కునాల్‌ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించారు. లాక్‌డౌన్‌ విధించడానికి ముందే ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన తమ నిశ్చితార్థం జరిగిందని సోనాలి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

‘నా పుట్టిన రోజు ముగియడానికి ముందు నేను ఒక ప్రత్యేక ప్రకటన చేస్తున్నాను. నాకు కాబోయే భర్త కునాల్‌ను మీకు పరిచయం చేస్తున్నాను. 02-02-2020 రోజున మా ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఇంతకంటే మంచి రోజు ఉంటుందని నేను అనుకోవడం లేదు. మాకు మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను’ అని సోనాలి తెలిపారు. 

ఈ సందర్భంగా ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ... లండన్‌లో ఓ చిత్రం షూటింగ్‌ సమయంలో కునాల్‌తో పరిచయం అయినట్టు వెల్లడించారు. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరిగినట్టు తెలిపారు. రెండు నెలల క్రితం దుబాయ్‌లో ఉంటున్న కునాల్‌ను కలవడానికి వెళ్లానని.. అయితే లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే చిక్కుకుపోయానని చెప్పారు. కాగా, తొలుత మోడల్‌గా కేరీర్‌ ప్రారంభించిన సోనాలి.. ఆ తర్వాత పలు మరాఠి చిత్రాల్లో నటించారు. బాలీవుడు చిత్రం గ్రాండ్‌ మస్తీలో హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ భార్య పాత్రల్లో కనిపించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement